News April 16, 2024
నందలూరు: సివిల్స్‌లో మెరిసిన కృష్ణ శ్రీవాత్సవ్ యాదవ్

నందలూరు మండలానికి చెందిన గొబ్బిళ్ళ కృష్ణ శ్రీవాత్సవ్ ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షలో 444 ర్యాంక్ సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణ శ్రీవాత్సవ్ సోదరి విద్యాధరి కందుకూరు సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకే ఇంట్లో అక్క ఉద్యోగం, తమ్ముడు సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధించడం పట్ల గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.
Similar News
News September 6, 2025
కడప: LLB సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

YVU LLB (మూడేళ్ల, ఐదేళ్ల) పరీక్ష ఫలితాలను విశ్వవిద్యాలయ వీసీ ప్రొ. అల్లం శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. LLB (ఐదేళ్ల) మొదటి సెమిస్టర్ పరీక్షల్లో 50.42 శాతం మంది, LLB (మూడేళ్ల) ఫస్ట్ సెమిస్టర్ ఫలితాల్లో 17.63 శాతం మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొ. పి.పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొ. కృష్ణారావు పాల్గొన్నారు.
News September 6, 2025
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో వైవీయూకు ఉన్నత స్థానం: వీసీ

బోధన పరిశోధన సేవ అనే దృక్పథంతో ఏర్పాటైన వైవీయూ అనతి కాలంలోనే అత్యున్నత ప్రమాణాలతో పరిశోధనలతో ప్రముఖ విశ్వవిద్యాలయంగా కీర్తిని అందుకుందని వైవీయూ వీసీ ఆచార్య అల్లం శ్రీనివాసరావు వెల్లడించారు. తన ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) 2025లో వైవీయూ 51 నుంచి 100 లోపు ర్యాంకు లభించిందన్నారు.
News September 6, 2025
కడప జిల్లా వినాయక నిమజ్జన వేడుకల్లో అపశృతి

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల పరిదిలోని బాగాదుపల్లె వినాయక చవితి ఊరేగింపులో అపశృతి చోటుచేసుకుంది. గత శుక్రవారం వినాయక చవితి సందర్భంగా ఊరేగింపు సమయంలో ప్రమాదవశాత్తు టపాసులు పేలి కుమ్మితి పాలకొండయ్య (35)కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108లో బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు.