News November 25, 2025
ఖమ్మం జిల్లాకు3,107 టన్నుల యూరియా

ఖమ్మం జిల్లాకు యూరియా, కాంప్లెక్స్ ఎరువుల పంపిణీని చింతకాని మండలం పందిళ్లపల్లి ర్యాక్ పాయింట్‌లో టెక్నికల్ ఏవో పవన్ కుమార్ పరిశీలించారు. ర్యాక్ పాయింట్‌కు మొత్తం 3107.16 మెట్రిక్ టన్నుల యూరియా చేరింది. ఇందులో ఖమ్మం (1517 MT), భద్రాద్రి (500 MT) కేటాయించారు. రైతులకు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Similar News
News November 27, 2025
నెల్లూరు జిల్లాకు కన్నీటిని మిగిల్చిన పునర్విభజన

పెంచలకోన, శ్రీహరికోట, ఫ్లెమింగో ఫెస్టివల్..జిల్లా శిగలో మణిహారాలు. వీటితో నిత్యం <<18390784>>జిల్లా<<>> పర్యాటకులతో సందడిగా ఉండేది. జిల్లాల పునర్విభజన తర్వాత కథ మారింది. <<18390350>>3 నియోజకవర్గాలను<<>> తిరుపతిలో కలపడంతో చెంగాలమ్మ టెంపుల్, శ్రీసిటి, వెంకటగిరి జాతర, దుగ్గరాజపట్నం పోర్ట్ వంటి ప్రఖ్యాత ప్రదేశాలు వెళ్లిపోయాయని రొట్టెలపండుగ తప్ప <<18391147>>ఇంకేమీ<<>> మిగిలిదంటూ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
News November 27, 2025
VZM: బొత్స భద్రత లోపంపై విచారణకు ఆదేశం

పైడితల్లి సిరిమానోత్సవంలో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణకు కేటాయించిన వేదిక కూలిన ఘటనపై విచారణకు GAD ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా కలెక్టర్‌ను ఆదేశించారు. బొత్స ప్రొటోకాల్, భద్రతా లోపంపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డిని ఆదేశిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, వేదిక కూలిన ఘటనలో MLC సురేష్ బాబు, ఎస్సై, మరో బాలికకు గాయాలైన సంగతి తెలిసిందే.
News November 27, 2025
అండర్-16 రాష్ట్ర జట్టుకు ఎంపికైన శ్రీ ప్రకాశ్ సినర్జీ విద్యార్థులు

పెద్దాపురంలోని శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ విద్యార్థులు జి.లక్ష్మీ గౌతమ్ (11వ తరగతి), కె.తమన్ (10వ తరగతి) BCCI విజయ్ మర్చంట్ ట్రోఫీ(2025-26) అండర్-16 ఏపీ రాష్ట్ర క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. తూ.గో జిల్లా నుంచి రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థగా సినర్జీ క్రికెట్ అకాడమీ నిలిచిందని ఆ సంస్థ పేర్కొంది. ఈ అద్భుత విజయం సాధించిన విద్యార్థులను, కోచ్ దుర్గా ప్రసాద్‌ను యాజమాన్యం అభినందించింది.


