News November 25, 2025

మన్యం: యువకుడి మృతదేహం లభ్యం

image

కొమరాడ మండలం జంఝావతి రబ్బర్ డ్యాం వద్ద ఆదివారం ముగ్గురు యువకులు గల్లంతైన విషయం తెలిందే. వారిలో ప్రతాప్, గోవింద నాయుడు మృతదేహాలు గుంప సోమేశ్వర స్వామి ఆలయ సమీపంలో సోమవారం ఉదయం లభించగా.. సాయంత్రం శరత్ కుమార్ మృతదేహం కోటిపాం కారెడ్లు వద్ద లభించినట్లు కొమరాడ ఎస్సై నీలకంఠం తెలిపారు. పోస్ట్ మార్టం పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో జరిగినట్లు తెలిపారు.

Similar News

News November 25, 2025

జూలూరుపాడు: సైబర్ క్రైమ్ బారినపడి కోల్పోయిన నగదు రికవరీ

image

జూలూరుపాడుకు చెందిన జ్యోతిబసు అనే సైబర్ క్రైమ్ బాధితుడికి సైబర్ నేరంలో అతడు పోగొట్టుకున్న రూ.3,21,000 నగదును జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు, జూలూరుపాడు పోలీస్ అధికారుల సహాయంతో తిరిగి అతడి ఖాతాలో జమ చేశారు. జ్యోతిబసు అనే ఆటో డ్రైవర్‌కి ఒక గుర్తు తెలియని వ్యక్తి గత నెలలో పరిచయమై అతడి వద్ద నుంచి రూ.3,21,000 ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా మోసం చేశాడని చెప్పారు.

News November 25, 2025

భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాకు GOOD NEWS

image

తెలంగాణ క్యాబినెట్ మీటింగ్‌లో ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్ద నల్లబెల్లి గ్రామంలో యంగ్ ఇండియా స్కూల్‌కు స్థలం కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందుకు 20 ఎకరాల స్థలం కేటాయించామని చెప్పారు.

News November 25, 2025

డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు

image

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేశారు. మూడు దశల్లో (డిసెంబర్ 11, 14, 17) పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఉ.7 నుంచి మ.1 వరకు పోలింగ్ ఉంటుందని, అదే రోజు 2PM నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తామన్నారు. ఈ నెల 27 నుంచి తొలి విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని చెప్పారు.