News November 25, 2025

చలి తగ్గింది

image

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత తగ్గింది. పలు జిల్లాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతున్నాయి. ఇవాళ తెల్లవారు జామున HYDలో 19 డిగ్రీలు, పటాన్‌చెరులో 15.8 డిగ్రీలు, ADBలో 15.7, మెదక్‌లో 14.3 డిగ్రీలు, ఏపీలోని అరకులో 12, పాడేరులో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నాలుగైదు రోజులు ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Similar News

News November 25, 2025

పెద్దపల్లిలో షీ టీమ్ అవగాహన కార్యక్రమం

image

RGM సీపీ ఆదేశాలపై PDPLలోని ఒక కాలేజీలో పెద్దపల్లి షీ టీమ్ అవగాహన సదస్సు నిర్వహించింది. ఇన్‌ఛార్జ్ SI లావణ్య మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలు, యాంటీ డ్రగ్స్‌పై విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. వేధింపులపై 6303923700, సైబర్ మోసాలపై 1930, అత్యవసర పరిస్థితుల్లో 100కు కాల్ చేయాలన్నారు. బస్టాండ్, ప్రధాన చౌరస్తాల్లో రెగ్యులర్ పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

News November 25, 2025

సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

image

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.