News November 25, 2025

కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి

image

సిద్దిపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో KMR(D)కు చెందిన నవవధువు మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం..బిచ్కుందకు చెందిన సాయికిరణ్‌కు 4 నెలల క్రితం SDPTకు చెందిన ప్రణతితో పెళ్లైంది. వీరిద్దరూ HYDలో ఉద్యోగం చేస్తున్నారు. SDPTలో ఓ ఫంక్షన్‌కు ‌హజరైన దంపతులు నిన్న బైకుపై HYD వెళ్తుండగా పెద్దచెప్యాల వద్ద ట్రాక్టర్ వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రణతి మృతి చెందగా, సాయికిరణ్ గాయపడ్డాడు.

Similar News

News November 27, 2025

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

image

స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 295 పాయింట్లు లాభపడి 85,900 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు వృద్ధి చెంది 26,281 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. L&T, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా & మహీంద్రా, టాటా మోటార్స్ ప్యాసెంజర్ వెహికల్స్, టాటా స్టీల్, బజాజ్ ఫినాన్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎటర్నల్, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, మారుతీ, TCS షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

News November 27, 2025

శబరిమల యాత్రికుల విశ్రాంతి ప్రదేశం

image

శబరిమలకు వెళ్లే యాత్రికులు బస చేసే ప్రాంతమే ‘శిరియాన వట్టం’. ఒకప్పుడు ఇక్కడ ఏనుగుల సంచారం అధికంగా ఉండేది. కాలక్రమేణా భక్తుల రద్దీ పెరగడంతో వాటి రాక తగ్గింది. ఈ ప్రాంతం శబరిమల యాత్రికులకు ముఖ్యమైన విడిది కేంద్రంగా మారింది. తమ కఠినమైన ప్రయాణంలో అలసిపోయిన భక్తులు ఇక్కడి నుంచి పంబ నది వరకు తాత్కాలిక బస ఏర్పాటు చేసుకుంటారు. వంటలు చేసుకొని భుజించి, విశ్రమిస్తుంటారు. <<-se>>#AyyappaMala<<>>

News November 27, 2025

వరంగల్: బ్యాంకుల్లో నగదుకు కటకట

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో బ్యాంకుల్లో నగదుకు కొరత ఏర్పడింది. పెన్షన్ డబ్బుల కోసం బ్యాంకుల నుంచి పోస్టాఫీసులకు నగదు తరలింపు పెద్ద సమస్యగా మారింది. కలెక్టర్లు పక్క జిల్లాల నుంచి సర్దుబాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెలా పెన్షన్ల కోసం డబ్బు విడుదల కావట్లేదని సమాచారం. బిహార్ ఎన్నికల కోసం భారీగా నగదును తరలించడంతో సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. మరోపక్క ఆర్బీఐ నుంచి కూడా నగదు సరఫరా లేనట్లు సమాచారం.