News November 25, 2025
KCR, KTR.. కాస్ట్‌లీ భూములు ఆక్రమించారు: ఫోరెన్సిక్ ఆడిట్

సిరిసిల్ల జిల్లాలో ధరణి పోర్టల్‌పై ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తైంది. జిల్లాలో ధరణి పోర్టల్ దుర్వినియోగంపై ప్రభుత్వం తుదిమెరుగులు దిద్దుతోంది. KCR, KTR, హరీష్ రావుతో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో ధరణి పోర్టల్ సాయంతో ఖరీదైన భూములను ఆక్రమించారని ప్రాథమిక పరిశోధనలు చెబుతున్నాయి. తుది నివేదికను త్వరలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సమర్పించనున్నారు.
Similar News
News November 27, 2025
అండర్-16 రాష్ట్ర జట్టుకు ఎంపికైన శ్రీ ప్రకాశ్ సినర్జీ విద్యార్థులు

పెద్దాపురంలోని శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ విద్యార్థులు జి.లక్ష్మీ గౌతమ్ (11వ తరగతి), కె.తమన్ (10వ తరగతి) BCCI విజయ్ మర్చంట్ ట్రోఫీ(2025-26) అండర్-16 ఏపీ రాష్ట్ర క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. తూ.గో జిల్లా నుంచి రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థగా సినర్జీ క్రికెట్ అకాడమీ నిలిచిందని ఆ సంస్థ పేర్కొంది. ఈ అద్భుత విజయం సాధించిన విద్యార్థులను, కోచ్ దుర్గా ప్రసాద్‌ను యాజమాన్యం అభినందించింది.
News November 27, 2025
వారి కూతుళ్లపై కామెంట్స్.. IASకు నోటీసులు

బ్రాహ్మణుల కూతుళ్లపై <<18384712>>వివాదాస్పద<<>> కామెంట్లు చేసిన ఐఏఎస్ సంతోశ్ వర్మకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం షోకాజ్ నోటీసులిచ్చింది. IAS అధికారుల గౌరవం, ప్రవర్తనకు విరుద్ధంగా ఆయన కామెంట్లు ఉన్నాయని పేర్కొంది. ‘సంతోశ్ చర్యలు ఏకపక్షం, తీవ్రమైన దుష్ప్రవర్తన కిందికి వస్తాయి. ఆయన IAS రూల్స్(కండక్ట్)-1967ను ఉల్లంఘించారు. సంతోశ్ సమాధానం సంతృప్తికరంగా లేకపోతే క్రమశిక్షణాచర్యలను ఎదుర్కోవాల్సిందే’ అని స్పష్టం చేసింది.
News November 27, 2025
వంటింటి చిట్కాలు

* కూరల్లో పెరుగు వేసేటప్పుడు నేరుగా కలపకుండా, ఒక కప్పులో వేసి స్పూన్‌తో చిలికి వెయ్యాలి. అప్పుడే గ్రేవీ మొత్తానికి చిక్కదనం వస్తుంది.
* పాలు మాడకుండా ఉండాలంటే కాచే ముందు గిన్నెలో కొద్దిగా చన్నీరు పోసి వంపేయాలి.
* కిస్‌మిస్ నిల్వ ఉండాలంటే గాలి చొరబడని డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేస్తే నెలల తరబడి ఫ్రెష్‌గా ఉంటాయి.
* గుడ్లు ఉడికించేటప్పుడు కాస్త నూనె వేస్తే పగలవు.


