News April 16, 2024

HYD: ‘SUMMER CRICKET’ రిజిస్ట్రేషన్ చేసుకోండి!

image

HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో క్రికెట్ ప్రియులకు ‘HYD క్రికెట్ అసోసియేషన్’ శుభవార్త తెలిసింది. ఇప్పటికే ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు ‘HCA అధ్యక్షులు జగన్ మోహన్ రావు తెలిపారు. ఈనెల 18 వరకు https://www.hycricket.org/data-2024-25/summer-camp-apr-2024/sc-regn.html వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈనెల 21 నుంచి క్రికెట్ ఉచిత శిక్షణ ప్రారంభం అవుతుందన్నారు. SHARE IT

Similar News

News January 12, 2026

FLASH: బోరబండలో యువతి మర్డర్

image

బోరబండలో ఓ ఉన్మాది యువతిని పొట్టనబెట్టుకున్నాడు. తనతో సరిగ్గా మాట్లాడటం లేదని అక్కసుతో యువతిని అతడు దారుణంగా హత్య చేశాడు. గతంలో ఇద్దరికీ బంజారాహిల్స్‌లోని ఒక పబ్‌లో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ యువతి ఇటీవల ఊర్వశీ బార్‌కు షిఫ్ట్ కావడంతో మాట్లాడటం తగ్గిందని భావించిన నిందితుడు నిన్న మాట్లాడదామని పిలిచి హత్య చేసినట్లు సమాచారం. నిందితుడు ప్రస్తుతం బోరబండ పోలీసుల అదుపులో ఉన్నాడు.

News January 11, 2026

HYD: చైనా మాంజాతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ చెయ్యి కట్!

image

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా తగిలి సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. గచ్చిబౌలి నుంచి హఫీజ్‌పేట్ వైపు బైక్‌పై చైతన్య (27) వెళ్తున్నాడు. బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ పైకి రాగానే చైతన్య చేయికి గాలి పటం మాంజా తగిలింది. దీంతో మాంజా చెయ్యికి చుట్టుకోవడంతో చైతన్య చెయ్యి తెగింది. తీవ్ర గాయాలు అయిన చైతన్యను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

News January 11, 2026

HYD: కార్పొరేషన్ కోసం లష్కర్‌లో లడాయి

image

GHMCని 3గా విభజించనున్న నేపథ్యంలో సికింద్రాబాద్ లేదా లష్కర్ పేరిట కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ బలపడుతోంది. 220 ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్‌ను విస్మరించడం తగదని స్థానికులు, BRS నేతలు మండిపడుతున్నారు. HYD- సికింద్రాబాద్ జంట నగరాలుగా పేరొందగా, సికింద్రాబాద్ పేరు లేకుండా పునర్వ్యవస్థీకరణ సరికాదంటున్నారు. సర్కార్ దిగొచ్చి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొనేలా ఉద్యమం ఉద్ధృతం అయింది.