News November 25, 2025
HYD: మున్సిపాలిటీలపై ‘ముప్పేట దాడి’

ORR పరిసరాల్లో అస్తవ్యస్తంగా ఉన్న అభివృద్ధిని నియంత్రించడంలో విఫలమైన ప్రభుత్వం, ఏకంగా 27 మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేయాలని ప్రతిపాదించడంతో శివారులో సెగ రగులుతోంది. సమగ్ర ప్రణాళిక పేరుతో చేసే ఈ విలీనం, సేవలకు మేలో లేదో తెలియదు గానీ, ప్రజలకు పన్నులు, ఫీజుల భారం తప్పేలా లేదు. ఆదరాబాదరాగా తీసుకున్న ఈ నిర్ణయంపై అభిప్రాయం చెప్పాలని ప్రభుత్వం GHMCని ఆదేశించింది. ఇది ప్రజలకు వరమా, శాపమా మీ కామెంట్.
Similar News
News November 26, 2025
ఇండియాలో భద్రతపై నమ్మకముంది: ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ PM నెతన్యాహు DECలో జరగాల్సిన తన భారత పర్యటనను వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీ బాంబు పేలుడే ఇందుకు కారణమని ప్రచారం జరిగింది. తాజాగా ఇజ్రాయెల్ PMO దీనిపై స్పందించింది. ‘ఇజ్రాయెల్-ఇండియాతో పాటు ప్రధానులు నెతన్యాహు, మోదీల బంధం చాలా బలమైనది. PM మోదీ నాయకత్వంలోని భారత్‌లో భద్రతపై మా ప్రధానికి పూర్తి నమ్మకముంది. ఇప్పటికే కొత్త డేట్స్ కోసం చర్చలు ప్రారంభమయ్యాయి’ అని ట్వీట్ చేసింది.
News November 26, 2025
HYDను అంతర్జాతీయ పెట్టుబడుల హబ్‌గా నిలపాలి: సీఎం

హైదరాబాద్‌ను అంతర్జాతీయ పెట్టుబడుల హబ్‌గా నిలపాలని ‘తెలంగాణ రైజింగ్’ గ్లోబల్ సమ్మిట్‌ను విజయవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రానికి ఉన్న రోడ్డు నెట్‌వర్క్, పోర్ట్ కనెక్టివిటీ, సంస్కృతి, వాతావరణం వంటి అనుకూలతలను ప్రపంచానికి చాటాలన్నారు. అలాగే రామప్ప నుంచి సమ్మక్క- సారక్క, నల్లమల్ల పులులు, తెలంగాణ ప్రముఖులు- అన్నీ రాష్ట్ర బ్రాండింగ్‌లో ప్రతిఫలించాలని సూచించారు.