News April 16, 2024

HYD: భార్యాభర్తల మధ్య గొడవ.. రైలు కిందపడి భర్త ఆత్మహత్య!

image

భార్యభర్తలు గొడవపడి మనస్థాపంలో భర్త రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. రైల్వే ఇన్స్పెక్టర్ ఆర్.ఎల్లప్ప తెలిపిన వివరాల ప్రకారం.. మలక్ పేట్ ప్రాంతానికి చెందిన విశ్రాంత సహాకార ఉద్యోగి ఎన్.సుదర్శన్(63) మలక్ పేట్-కాచిగూడ రైల్వే స్టేషన్ల మధ్య మంగళవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.

Similar News

News January 15, 2025

HYD: పోరాట యోధుడి జయంతి నేడు

image

1947లో ఇదే రోజు ప్రశ్నించే ఓ గొంతు జన్మించింది. 1960లో తొలిసారి ఆ కాలాతీత వ్యక్తి HYDలో అడుగుపెట్టారు. ఆయనే విద్యార్థులకు ప్రశ్నించడం నేర్పిన జార్జ్‌రెడ్డి. 25ఏళ్ల వయసులో మార్క్స్, సిగ్మన్‌ఫ్రాయిడ్‌ వంటి ఫిలాసఫర్‌లను చదివేశారు. కేవలం ఉద్యమమే కాదు ఎదుటివారిని ఆలోచింపజేసే వక్త ఆయన. విద్యార్థి ఉద్యమం అంటే జార్జ్‌రెడ్డి గుర్తొచ్చేంతగా ఆయన పోరాటం.. ఓయూ నుంచే ప్రారంభం అవ్వడం హైదరాబాదీలకు గర్వకారణం.

News January 15, 2025

HYD: పొలం అనుకుంటే పొరపాటే..!

image

ఈ ఫోటోలో పచ్చని పైరులా కనిపించేది.. పొలం, నారుమడి అని అనుకుంటే పొరపాటే. HYD పరిధి కొండాపూర్ మజీద్‌బండ చెరువును గుర్రపు డెక్క కప్పేయడంతో ఇలా కనిపిస్తోంది. HYDలో అనేక చెరువుల పరిస్థితి ఇదే విధంగా ఉందని, గ్రేటర్ ప్రజలు జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు చేస్తున్నారు. ఫిర్యాదులు చేసి నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోయారు. చెరువుల సుందరీకరణపై శ్రద్ధ ఎక్కడ..? అని ప్రశ్నించారు.

News January 15, 2025

HYD: జంక్షన్ల అభివృద్ధి పై GHMC FOCUS

image

గ్రేటర్ HYDలో జంక్షన్‌లలో వంతెనలు, అండర్ పాస్ నిర్మాణాల సుందరీకరణపై జీహెచ్ఎంసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఖైరతాబాద్ సర్కిల్ సంత్ నిరాకారి భవన్ జంక్షన్ ప్రాంతాన్ని అద్భుతమైన కళారూపాలతో తీర్చిదిద్ది, ప్రత్యేకంగా ఫౌంటెయిన్ ఏర్పాటు చేశారు. అటువైపు వెళ్తున్న వారిని ఎంతగానో ఆకర్షిస్తుంది.