News April 16, 2024

GREAT: కష్టాల ప్రయాణం.. కోచింగ్ లేకుండా సివిల్స్ రెండో ర్యాంక్

image

ఇవాళ విడుదలైన సివిల్స్ ఫలితాల్లో దేశంలోనే రెండో ర్యాంక్ సాధించిన అనిమేశ్(ఒడిశా) జీవితంలోని కష్టాల ప్రయాణం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. అతని తండ్రి 9ఏళ్ల కిందటే చనిపోయాడు. సరిగ్గా సివిల్స్ ఇంటర్వ్యూ సమయంలో తల్లి క్యాన్సర్‌తో మరణించింది. ఆ విషాదాన్ని దిగమింగి లక్ష్యం వైపు అడుగులు వేసి తొలి ప్రయత్నంలోనే సివిల్స్ క్లియర్ చేశారు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా రోజుకు 5-6 గంటలు చదివానని అతను తెలిపారు.

Similar News

News February 2, 2026

పీఎం కిసాన్ రూ.6వేలే.. పెంపు లేదు

image

దేశవ్యాప్తంగా పంట పెట్టుబడి సాయం కోసం కేంద్రం పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు ఏడాదికి రూ.6వేలు (3 విడతల్లో) ఇస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని రూ.8 వేలు లేదా రూ.10 వేలకు పెంచుతారని వార్తలు వచ్చాయి. అయితే బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా తెలంగాణలో ఈ స్కీమ్ ద్వారా 30 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు.

News February 2, 2026

స్కిల్ కేసు నుంచి చంద్రబాబుకు పూర్తి ఊరట!

image

AP: చంద్రబాబు సీఎం అయ్యాక పలు కేసుల నుంచి ఉపశమనం లభిస్తోంది. తాజాగా స్కిల్ డెవలప్మెంట్ కేసు దాదాపుగా ముగిసినట్లేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని CID గతంలోనే పేర్కొంది. కేసు మూసేయాలని కోరడంతో గతనెల 12న కోర్టు ఆమోదించింది. ఈ కేసుతో ఆయనకు సంబంధంలేదని ED కూడా తేల్చేసింది. దీంతో ఆయనకు క్లీన్ చిట్ లభించినట్లు అయ్యింది.

News February 2, 2026

ఐరన్ లోపం-లక్షణాలు

image

ఐర‌న్ లోపం ఉంటే ర‌క్తం త‌గినంత త‌యారు కాదు. ఎర్ర ర‌క్త క‌ణాల సంఖ్య త‌గ్గిపోతుంది. దీంతో చ‌ర్మం పాలిపోయిన‌ట్లు తెల్ల‌గా మారుతుందంటున్నారు నిపుణులు. త‌ర‌చూ చ‌ల్ల‌ని ప‌దార్థాల‌ను తినాల‌నిపించడం, నోట్లో అల్సర్లు, శరీరంలో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా రావడం, కాళ్లు, చేతులు చల్లగా ఉండటం వంటి లక్షణాలుంటాయి. ఈ వీటిని గుర్తిస్తే ముందుగానే త‌గిన చికిత్స తీసుకోవ‌చ్చు. దీంతో ఐర‌న్ లోపం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.