News April 17, 2024
బట్లర్ బాదేశాడు.. కోల్‌కతాపై రాజస్థాన్ విక్టరీ

ఉత్కంఠభరితమైన పోరులో కోల్‌కతాపై రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం సాధించింది. జోస్ బట్లర్ 107*(60) ధాటిగా ఆడటంతో రాజస్థాన్ 224 పరుగుల భారీ లక్ష్యాన్ని సైతం ఛేదించింది. రియాన్ పరాగ్ 34(14) మినహా టాప్, మిడిల్ ఆర్డర్‌లో బ్యాటర్లు ఎవరూ సరైన భాగస్వామ్యం అందించలేదు. కానీ బట్లర్ ఒంటరి పోరాటం చేసి మ్యాచ్ గెలిపించాడు. దీంతో కోల్‌కతాలో నరైన్ సెంచరీ వృథా అయింది.
Similar News
News January 27, 2026
ఇంటర్వ్యూతో ESIC ఫరీదాబాద్‌లో 50 పోస్టులు

<
News January 27, 2026
ఒకే రోజు రూ.63 కోట్ల కలెక్షన్లు

సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘బార్డర్-2’ భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. నిన్న ఒక్క రోజే ఈ మూవీకి రూ.63 కోట్ల కలెక్షన్లు వచ్చాయని మేకర్స్ తెలిపారు. మొత్తంగా నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.193.48 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిందని పేర్కొన్నారు. అనురాగ్ సింగ్ తెరకెక్కించిన ఈ మూవీలో వరుణ్ ధవన్, దిల్జీత్ దోసాంజ్ కీలక పాత్రలు పోషించారు.
News January 27, 2026
మోదీ ట్వీట్.. వివాదాస్పదంగా అనువదించిన గ్రోక్

మాల్దీవ్స్‌కు థాంక్స్ చెబుతూ PM మోదీ చేసిన ట్వీట్‌ను <<18752905>>‘గ్రోక్’<<>> తప్పుగా అనువదించింది. ‘రిపబ్లిక్ డే వేడుకలు మాల్దీవ్స్‌లో జరిగాయి. ఈ సుకురియా ప్రభుత్వం భారత వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటోంది. భారత వ్యతిరేక ప్రచారాల్లో ముందుంది’ అన్నట్లు ట్రాన్స్‌లేట్ చేసింది. నిజానికి మోదీ 2 దేశాల ప్రయోజనాల కోసం కలిసి పని చేద్దామని, మాల్దీవుల ప్రజలందరికీ శ్రేయస్సు, ఆనందంతో నిండిన భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు.


