News November 26, 2025
‘జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణతే లక్ష్యం’

రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని గణనీయంగా పెంపొందించేందుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ సంకల్పం-2026 పేరుతో 50 రోజుల ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ పి.రంజిత్ బాషా ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా వృత్తి విద్యాశాఖధికారి ఆర్.సురేష్ మంగళవారం తెలిపారు. విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని గణనీయంగా మెరుగుపరచడమే సంకల్పం లక్ష్యం అన్నారు.
Similar News
News February 9, 2026
శ్రీకాకుళం: టెన్త్ విద్యార్థులకు గమనిక

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం జరగనున్న ఎగ్జామ్స్‌లో ఓ పరీక్ష తేదీని మార్చినట్లు డీఈవో రవి కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 20న జరగాల్సిన ఇంగ్లిషు పరీక్ష, ఆ రోజు రంజాన్ కావడంతో మరుసటి రోజు 21న నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ మార్పును టీచర్లు, విద్యార్థులు గమనించాలన్నారు.
News February 9, 2026
ఈనెల 11న టెక్కలిలో మెగా జాబ్ మేళా

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 11న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సాయిబాబు తెలిపారు. ఈ ప్రాంగణ ఎంపికల్లో 12 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హత కలిగి, 18-35 ఏళ్లలోపు వయసున్న యువతీయువకులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు తమ ధ్రువపత్రాలతో హాజరుకావాలని ఆయన సూచించారు.
News February 9, 2026
SKLM: సోమవారం జడ్పీలో గ్రీవెన్స్

శ్రీకాకుళంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా లేదా Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా అర్జీలు సమర్పించవచ్చన్నారు. అర్జీల స్థితిగతులను 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని ఆయన సూచించారు.


