News November 26, 2025

‘జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణతే లక్ష్యం’

image

రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని గణనీయంగా పెంపొందించేందుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ సంకల్పం-2026 పేరుతో 50 రోజుల ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ పి.రంజిత్ బాషా ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా వృత్తి విద్యాశాఖధికారి ఆర్.సురేష్ మంగళవారం తెలిపారు. విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని గణనీయంగా మెరుగుపరచడమే సంకల్పం లక్ష్యం అన్నారు.

Similar News

News February 5, 2026

పొందూరు: గడ్డి మందు తాగిన వ్యక్తి మృతి

image

గడ్డి మందును తాగిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన పొందూరు మండలంలో జరిగింది. మండలంలోని తానే గ్రామానికి చెందిన పాపినాయుడు(65) ఈ నెల 22న రాత్రి మద్యం మత్తులో గడ్డి మందు తాగాడు. అపస్మారక స్థితిలోకి చేరుకోగా కుటుంబీకులు రిమ్స్‌లో చేర్చారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 5, 2026

శ్రీకాకుళం: నకీలి పాసుల కథ నడిపించిందెవరు?

image

అరసవల్లి రథసప్తమి వేడుకల్లో నకిలీ పాసుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వీటి ముద్రణపై SM ఇన్‌ఫ్లుయోన్సర్ల పాత్ర ఉందని వచ్చిన ఆరోపణలను వారు ఖండించారు. తాజాగా ఆలయానికి సమీప జిరాక్స్ షాపుల్లోనే ఈ ముద్రణ జరిగినట్లు ప్రచారం సాగుతోంది. వేడుకల్లోని కార్యక్రమాలకు వేల సంఖ్యలో పుట్టుకొచ్చిన పాసులకు బాధ్యులెవరో(SM ఇన్‌ఫ్లుయోన్సర్ల? జిరాక్స్ షాపుల? ఇతరుల?) బయటపెట్టేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News February 5, 2026

ఎచ్చెర్ల: సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ B.Tech మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూలను ఆ విభాగం అధికారి డాక్టర్ ఎస్. ఉదయ భాస్కర్ బుధవారం సాయంత్రం విడుదల చేశారు. ఎగ్జామ్స్ ఈ నెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యార్థులు గమనించాలని అన్నారు.