News April 17, 2024
HYD నగర ప్రజలకు GOOD NEWS.. త్వరలో 3D VIEW
రాష్ట్ర రాజధాని HYD నగరానికి 3D చిత్రం రాబోతుంది. గ్రేటర్ విస్తీర్ణాన్ని డ్రోన్లతో రికార్డు చేసి, తద్వారా వచ్చే బేస్ మ్యాప్ పై క్షేత్రస్థాయి సర్వేలో తీసే ఫొటోలు, ఇతర వివరాలను పొందుపరుస్తారు. దీని పై GHMC ఐటీ విభాగం భారీ కసరత్తు చేసింది. మొదట ఆస్తిపన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు,తాగునీరు, విద్యుత్తు కనెక్షన్లు, నగరంలోని ఎత్తుపల్లాలు, నిర్మాణాలను సైతం డిజిటలైజ్ చేయనున్నారు.
Similar News
News January 15, 2025
HYD: పోరాట యోధుడి జయంతి నేడు
1947లో ఇదే రోజు ప్రశ్నించే ఓ గొంతు జన్మించింది. 1960లో తొలిసారి ఆ కాలాతీత వ్యక్తి HYDలో అడుగుపెట్టారు. ఆయనే విద్యార్థులకు ప్రశ్నించడం నేర్పిన జార్జ్‌రెడ్డి. 25ఏళ్ల వయసులో మార్క్స్, సిగ్మన్‌ఫ్రాయిడ్ వంటి ఫిలాసఫర్‌లను చదివేశారు. కేవలం ఉద్యమమే కాదు ఎదుటివారిని ఆలోచింపజేసే వక్త ఆయన. విద్యార్థి ఉద్యమం అంటే జార్జ్‌రెడ్డి గుర్తొచ్చేంతగా ఆయన పోరాటం.. ఓయూ నుంచే ప్రారంభం అవ్వడం హైదరాబాదీలకు గర్వకారణం.
News January 15, 2025
HYD: పొలం అనుకుంటే పొరపాటే..!
ఈ ఫోటోలో పచ్చని పైరులా కనిపించేది.. పొలం, నారుమడి అని అనుకుంటే పొరపాటే. HYD పరిధి కొండాపూర్ మజీద్‌బండ చెరువును గుర్రపు డెక్క కప్పేయడంతో ఇలా కనిపిస్తోంది. HYDలో అనేక చెరువుల పరిస్థితి ఇదే విధంగా ఉందని, గ్రేటర్ ప్రజలు జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు చేస్తున్నారు. ఫిర్యాదులు చేసి నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోయారు. చెరువుల సుందరీకరణపై శ్రద్ధ ఎక్కడ..? అని ప్రశ్నించారు.
News January 15, 2025
HYD: జంక్షన్ల అభివృద్ధి పై GHMC FOCUS
గ్రేటర్ HYDలో జంక్షన్‌లలో వంతెనలు, అండర్ పాస్ నిర్మాణాల సుందరీకరణపై జీహెచ్ఎంసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఖైరతాబాద్ సర్కిల్ సంత్ నిరాకారి భవన్ జంక్షన్ ప్రాంతాన్ని అద్భుతమైన కళారూపాలతో తీర్చిదిద్ది, ప్రత్యేకంగా ఫౌంటెయిన్ ఏర్పాటు చేశారు. అటువైపు వెళ్తున్న వారిని ఎంతగానో ఆకర్షిస్తుంది.