News November 26, 2025

చిత్తూరు జిల్లాకు ప్రథమ స్థానం.!

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఓటర్ల జాబితా క్లెయిమ్‌ల పరిష్కారంలో చిత్తూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నట్లు డీఆర్ఓ మోహన్ కుమార్ పేర్కొన్నారు. నవంబర్ నెలకు గాను మంగళవారం జిల్లా సచివాలయంలో గుర్తింపు పొందిన పార్టీ ప్రతినిధులతో డీఆర్ఓ సమీక్షించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్లెయిమ్‌ల పరిష్కారం వేగవంతం అవుతుందని అన్నారు. జిల్లాలో ప్రస్తుతం 15,74,979 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించామన్నారు.

Similar News

News February 20, 2026

చిత్తూరు: హెల్ప్ లైన్ నెంబర్లు గుర్తుంచుకోవాలి

image

అత్యవసర సమయాలలో ఉపయోగపడే 112 (ఎమర్జెన్సీ నెంబర్), 1098 (చైల్డ్ హెల్ప్ లైన్) వంటి నెంబర్లను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని విద్యార్థులకు మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ కరీమున్నీసా సూచించారు. చిత్తూరు విద్యాశ్రమం పాఠశాలలో శుక్రవారం పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులను ఎవరైనా అసౌకర్యంగా తాగితే టీచర్లు, తల్లిదండ్రులకు చెప్పాలన్నారు.

News February 20, 2026

ద్రవిడ వర్సిటీకి పెరిగిన గ్రాంట్

image

కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయానికి TTD నుంచి అందుతున్న వార్షిక నిర్వహణ గ్రాంట్‌ను ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు రూ.50 లక్షలు అందుతుండగా, 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి దాన్ని రూ.1 కోటికి పెంచింది. TTD బోర్డు తీర్మానం మేరకు ఈ పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో విశ్వవిద్యాలయ అభివృద్ధి, మౌలిక సదుపాయాల బలోపేతానికి తోడ్పాటు లభించనుంది.

News February 19, 2026

మదనపల్లెలో బాలిక హత్య.. నిందితుడి తల్లిపైనా కేసు

image

మదనపల్లెలో బాలికపై హత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు వన్ టౌన్‌ పోలీసులు నిందితుడి తల్లిపై కేసు నమోదు చేశారు. A1గా కులవర్ధన్‌ను, A2గా అతడి తల్లి అంజలిని పేర్కొన్నారు. అంజలిపై హత్య, హత్యా నేరం తారుమారు, హత్య జరిగిన సమాచారాన్ని పోలీసులకు చెప్పకపోవడం వంటి అభియోగాలపై కేసు నమోదు చేశామని DSP మహేంద్ర ప్రకటించారు. ఆమె కోసం గాలిస్తున్నామని తెలిపారు.