News April 17, 2024
రాళ్లు పట్టుకున్న చేతుల్లో ఇప్పుడు ల్యాప్‌టాప్స్ వచ్చాయి: షా

జమ్మూకశ్మీర్‌లో బీజేపీ విజయంపై కేంద్రహోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం ఇక్కడి ప్రజల నమ్మకాన్ని, ప్రేమను పొందిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో కమలం దానంతట అదే వికసిస్తుందన్నారు. ‘ప్రధాని మోదీ హయాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం నశించింది, రాళ్లు దాడులు ఆగాయి, ఆర్టికల్ 370 రద్దైంది. ఒకప్పుడు రాళ్లు పట్టుకున్న జమ్మూకశ్మీర్ యువత చేతిలో ఇప్పుడు ల్యాప్‌టాప్స్ వచ్చాయి’ అని పేర్కొన్నారు.
Similar News
News February 3, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (FEB-3, మంగళవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.36 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.12 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.27 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 3, 2026
ఈ నెల 6న క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన

AP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న క్వాంటం వ్యాలీకి ఈ నెల 6న శంకుస్థాపన జరగనుంది. దీని కోసం తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో 50 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు ఈ కార్యక్రమానికి అనువైన స్థలాన్ని పరిశీలించారు.
News February 3, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


