News April 17, 2024

వాయుసేన మాజీ యోధుడు కన్నుమూత

image

భారతీయ వాయుసేన మాజీ అధికారి స్క్వాడ్రన్ లీడర్ దలీప్ సింగ్ మజితియా (103) మంగళవారం కన్నుమూశారు. ఉత్తరాఖండ్‌ రుద్రపూర్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో వాయుసేనలో చేరిన దలీప్ భయమెరుగని యోధుడిగా గుర్తింపుపొందారు. 1942-1943 మధ్య బర్మా వద్ద వాయుసేనకు ఆయన అందించిన సేవలు మర్చిపోలేనివని IAF వర్గాలు పేర్కొన్నాయి. 1920 జూలై 27న జన్మించిన దలీప్ 1940లో వాయుసేనలో చేరారు.

Similar News

News February 5, 2026

కానుగ నీడ, కన్నతల్లి నీడ

image

ప్రకృతిలో లభించే నీడలలో కానుగ చెట్టు నీడ అత్యంత చల్లనిదిగా పరిగణించబడుతుంది. ఇతర చెట్ల కంటే దీని ఆకులు దట్టంగా ఉండి, ఎండను అసలు చొరబడనీయకుండా ఉంటాయి. అందుకే ఈ చెట్టు కింద సేద తీరితే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక బిడ్డకు తన కన్నతల్లి ఒడి ఎంతటి భద్రతను, చల్లదనాన్ని, ఓదార్పును ఇస్తుందో.. ఎండలో అలసిపోయిన బాటసారికి కానుగ చెట్టు నీడ అంతటి ఉపశమనాన్ని ఇస్తుందని ఈ సామెత తెలియజేస్తుంది.

News February 5, 2026

WPL-2026: ఫైనల్ క్వీన్ ఎవరో?

image

WPL-2026లో ఇవాళ ఢిల్లీ, బెంగళూరు మధ్య వడోదర వేదికగా ఫైనల్ జరగనుంది. వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరిన ఢిల్లీ తొలి టైటిల్‌పై కన్నేసింది. ఈ సీజన్‌లో ఆరు విజయాలతో టేబుల్ టాపర్‌గా ఉన్న RCB రెండో సారి ట్రోఫీ నెగ్గాలని చూస్తోంది. ఇరు జట్లు 9 సార్లు తలపడగా ఆరు విజయాలతో ఢిల్లీదే పైచేయిగా ఉంది. అయినా 2024 ఫైనల్లో ఆర్సీబీ చేతిలో ఓడటం DCని కలవరపరుస్తోంది.
మ్యాచ్: 7.30pm, లైవ్: జియో హాట్‌స్టార్, Star Sports.

News February 5, 2026

ఫిరాయింపు ఆరోపణలు.. ఆ ఇద్దరే బాకీ!

image

TG: ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది MLAలలో 8 మందికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. పోచారం శ్రీనివాస్, సంజయ్, గూడెం మహిపాల్, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాశ్ గౌడ్, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ పార్టీ మారారంటూ దాఖలైన పిటిషన్లను ఆయన కొట్టివేశారు. ఇంకా దానం నాగేందర్, కడియం శ్రీహరి మిగిలారు. దానం అనర్హత పిటిషన్‌పై ఈ నెల 18కి, కడియంకు 19కి విచారణను స్పీకర్ వాయిదా వేశారు.