News April 17, 2024

బ్యాలెట్ వ్యవస్థ వస్తే ఏమవుతుందో తెలుసు: సుప్రీంకోర్టు

image

ఈవీఎం వ్యవస్థను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో బ్యాలెట్ పేపర్ల వ్యవస్థ ఉంటే ఎన్నికలు ఎలా జరుగుతాయో చూశామని, ఆ ఘటనలు ఇంకా మర్చిపోలేమని పేర్కొంది. ఈవీఎంలకు ప్రత్యామ్నాయం ఏంటని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ను కోర్టు ప్రశ్నించగా, ఆయన బ్యాలెట్ పేపర్ వ్యవస్థను సూచించారు. ఈ నేపథ్యంలో ఆ వ్యవస్థ సరికాదంటూ కోర్టు అభిప్రాయపడింది.

Similar News

News February 2, 2026

హైస్పీడ్ కారిడార్ల ఏర్పాటుతో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు

image

కేంద్ర బడ్జెట్‌లో రైల్వేకు రూ.2.77 లక్షల కోట్లు కేటాయించడంపై సెంట్రల్ రైల్వే మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ సంతోషం వ్యక్తం చేశారు. ‘వికసిత్ భారత్’ లక్ష్యాల దిశగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని పేర్కొన్నారు. రైల్వే, ప్రయాణికుల భద్రత కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. ఏడు హైస్పీడ్ కారిడార్ల అభివృద్ధి వల్ల రూ.16 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

News February 2, 2026

ఇండియన్ నేవీలో 260 పోస్టులు

image

ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా 260 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి BE/BTech, MBA, BSc/B.Com/BSc(IT), MSc/MA, ME/MTech ఉత్తీర్ణతతో పాటు శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అకడమిక్ మెరిట్, SSB ఇంటర్వ్యూ, DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.1,25,000 చెల్లిస్తారు. అర్హులు FEB-24 వరకు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు https://www.joinindiannavy.gov.in చూడండి.

News February 2, 2026

రాష్ట్ర ప్రగతికి చేయూతనిచ్చేలా కేంద్ర బడ్జెట్: పవన్

image

AP: కేంద్ర బడ్జెట్ ఫలాలు ఏపీ ప్రగతికి దోహదం చేసేలా ఉన్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. పర్యాటక రంగ ప్రోత్సాహకాలు అరకు అభివృద్ధికి, ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ రాష్ట్ర తీర ప్రాంత పారిశ్రామిక ప్రగతికి మరింత ఊతం ఇస్తుందన్నారు. బడ్జెట్‌లో కొబ్బరి, జీడిపప్పు, కోకో రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలతో కోనసీమ కొబ్బరి రైతులకు, ఉత్తరాంధ్ర జీడి రైతులకు మేలు జరుగుతుందని ఆకాంక్షించారు.