News April 17, 2024

మెదక్: సివిల్ సర్వీస్ ఫలితాల్లో నర్సంపల్లి వాసి

image

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నర్సంపల్లికి చెందిన కె. అర్పిత నిన్న విడుదలైన సివిల్ సర్వీస్ ఫలితాల్లో 639 ర్యాంకు సాధించారు. తండ్రి అమర్ సింగ్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో సీనియర్ మేనేజర్ గా పని చేస్తుండగా.. తల్లి రేణుక సదాశివపేట రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. ర్యాంకు సాధించడం పట్ల నర్సంపల్లి వాసులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News September 11, 2025

మెదక్: మొత్తం ఓటర్లు= 5,23,327 మంది

image

మెదక్ జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్క తేలింది. బుధవారం సాయంత్రం తుది జాబితా ప్రకటించారు. 21 జడ్పీటీసీ, 190 ఎంపీటీసీ స్థానాలుండగా 1052 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జడ్పీ సీఈఓ ఎల్లయ్య వెల్లడించారు. జిల్లాలో 2,51,532 మంది పురుషులు, 2,71,787 మంది మహిళలు, 8 మంది ఇతరులు ఉన్నారని, మొత్తం 5,23,327 మంది ఓటర్లున్నారని వివరించారు.

News September 11, 2025

మెదక్: బోధనా నాణ్యత పెరగాలి: కలెక్టర్

image

మెదక్ జిల్లా కేంద్రంలోని వెస్లీ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి FLN, TLM బోధన అభ్యసన మేళాను కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం ప్రారంభించారు. ఉపాధ్యాయుల సృజనాత్మకతను ప్రోత్సహించడం, తరగతి గదుల్లో బోధనా నాణ్యతను మెరుగుపరచడం కోసమే బోధన అభ్యసన మేళాను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ మేళాలో 21 మండలాల నుంచి 1-5 తరగతుల ఉపాధ్యాయులు పాల్గొనగా ఎనిమిది మంది టీచర్స్ రాష్ట్రస్థాయి మేళాకు ఎంపికయ్యారు.

News September 10, 2025

కళా నైపుణ్యాలను వెలికితీయడానికే కళా ఉత్సవ్​: డీఈవో

image

విద్యార్థుల్లో దాగి ఉన్న కళానైపుణ్యతను వెలికితీయడానికే ఉద్దేశంతోనే కళా ఉత్సవ్​ పోటీలను నిర్వహిస్తున్నట్లు​ జిల్లా విద్యాధికారి (డీఈవో) ప్రొఫెసర్​ రాధాకిషన్​ అన్నారు. బుధవారం మెదక్​ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో కళా ఉత్సవ్​ ప్రారంభించారు. డీఈవో​ మాట్లాడుతూ.. విద్యార్థులలో కళా నైపుణ్యాలను వెలికితీసేందుకు కళా ఉత్సవ్ పోటీలు ఉపయోగ పడతాయని పేర్కొన్నారు.