News April 17, 2024
నెల్లూరును ఇండస్ట్రియల్ కారిడార్‌గా అభివృద్ధి చేస్తా: వేమిరెడ్డి

తాను గెలిస్తే నెల్లూరును ఇండస్ట్రియల్ కారిడార్‌గా అభివృద్ధి చేస్తానని నెల్లూరు టిడిపి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం రామలింగపురం, ముత్యాలపాలెం ప్రాంతాలలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
Similar News
News October 8, 2025
నెల్లూరు: ‘మహిళలపై జరిగే నేరాల నివారణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి’

మహిళలపై జరిగే నేరాల నివారణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పోలీసులకు గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో DSP, ఆపై స్థాయి పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలను ఆరా తీశారు. ప్రాపర్టీ, రౌడీ ఎలెమెంట్స్, గాంజా, మిస్సింగ్ కేసులు, పోక్సో వంటి కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
News October 7, 2025
నెల్లూరు: కేవలం 2 వేల మెట్రిక్ టన్నులే కొనుగోలు.!

జిల్లాలో ఎడగారు సీజన్‌కు ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే 40 శాతం కోతలు సైతం అయిపోయాయన్నారు. కేవలం 2 వేలు మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. దీన్ని బట్టి చూస్తే.. కోతలు దాదాపు పూర్తయ్యే దశలో PPC లను ఏర్పాటు చేయడంతో అన్నదాతలు బాగా నష్టపోయారు. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇవి ఉపయోగపడలేదని రైతన్నలు ఆరోపిస్తున్నారు.
News October 7, 2025
నెల్లూరు: ‘మీకు తెలిస్తే చెప్పండి’

కలిగిరి మండలంలోని వెలగపాడు సచివాలయం ముందు గల బస్ షెల్టర్ నందు ఒక గుర్తు తెలియని వ్యక్తి చనిపోవడంతో స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 40- 45 ఏళ్లు ఉండవచ్చని, చనిపోయిన వ్యక్తి వేసుకున్న షర్ట్ కాలర్ మీద “Pavan Men’s Wear” పామూరు అని ఉన్నట్టు ఎస్సై ఉమాశంకర్ తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలిస్తే కలిగిరి PS 9440700098 నంబర్‌కు సంప్రదించాలన్నారు.