News April 17, 2024

కరెంటు కోతలు అసత్య ప్రచారం: భట్టి

image

రాష్ట్రంలో కరెంటు కోతలున్నాయని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం బూటకమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక నాణ్యమైన కరెంటు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఎక్కడా పవర్ కట్లు లేవన్నారు. పదే పదే ప్రభుత్వాన్ని కూల్చుతామనడం బీఆర్ఎస్ పార్టీకి సరికాదన్నారు. అక్కడ విధానాలు నచ్చకే కాంగ్రెస్లోకి వస్తున్నారని పేర్కొన్నారు.

Similar News

News October 1, 2024

డీఎస్సీ ఫలితాలలో సత్తాచాటిన భద్రాద్రి జిల్లా

image

ప్రభుత్వం నిన్న డీఎస్సీ ఫలితాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలలో భద్రాద్రి జిల్లా వాసులు సత్తా చాటారు. దమ్మపేటకి చెందిన మిద్దే హరికిరణ్‌కి ఎస్ఎ ఫిజీకల్ సైన్స్‌లో మెుదటి ర్యాంక్, భద్రాచలం ఎంపీకాలనీకి చెందిన పావురాల వినోద్ కృష్ణ ఎస్‌ఎ సోషల్‌లో 2వ ర్యాంక్, అశ్వారావుపేట మండలం వినాయకపురంకి చెందిన రొయ్యల గణేష్‌ ఎస్జీటీలో 3వ ర్యాంక్ సాధించాడు. దీంతో వారి గ్రామస్థులు వారిని అభినందించారు.

News October 1, 2024

ఖమ్మం గ్రీవెన్స్‌కు భారీగా వినతులు

image

ఖమ్మం గ్రీవెన్స్‌లో వివిధ సమస్యలపై ప్రజలు వినతులు అందించేందుకు భారీగా తరలివచ్చారు. కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి ఎక్కువగా భూ సంబంధిత సమస్యలే వచ్చాయని వాటిని క్షేత్రస్థాయిలో వెళ్లి విచారించి న్యాయం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

News September 30, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

• విద్యార్థుల చదువులకు ఆటంకం కలగొద్దు: జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్
• ఆపరేషన్ చేసి గడ్డను తొలగించిన భద్రాచలం ఎమ్మెల్యే
• ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి: భద్రాద్రి జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్
• పాలడుగు జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ సస్పెండ్
• కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న గిరిజన సంఘాలు
• భద్రాచలం వద్ద స్వల్పంగా పెరిగిన గోదావరి నీటిమట్టం