News November 26, 2025
శ్రీకాకుళం రానున్న శాసనసభ అంచనాల కమిటీ: కలెక్టర్

రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ ఈ నెల 27న జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం తెలిపారు. శ్రీకూర్మాం చేరుకొని శ్రీకూర్మనాధ స్వామి దేవాలయాన్ని సందర్శిస్తారన్నారు. రాత్రి శ్రీకాకుళం ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో బస చేసి 28న శ్రీ అరసవిల్లి సూర్యనారాయణ స్వామిని దర్శనం చేసుకుంటారని వివరించారు.
Similar News
News February 28, 2026
శ్రీకాకుళం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా రూపలత

శ్రీకాకుళం జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిగా (ఐసీడీఎస్ పీడీ) కె.రూపలత శనివారం నియమితులయ్యారు. ప్రస్తుతం రణస్థలం మండలం సీడీపీవోగా విధులు నిర్వర్తిస్తున్న ఈమెకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో పీడీగా పనిచేసిన జయదేవి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఆమెకు కార్యాలయం సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
News February 28, 2026
SKLM: 19 పోస్ట్ ఆఫీసుల్లో ఆధార్ సేవలు

శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలో గల 19 తపాలా కేంద్రాల్లో పూర్తిస్థాయి ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నాయని పోస్టల్ సూపరింటెండెంట్ వి.హరిబాబు శనివారం తెలిపారు. శ్రీకాకుళం, ఆముదాలవలస, టెక్కలి ప్రధాన కార్యాలయాలతో పాటు రాజాం, పొందూరు, ఎస్.ఆర్.పురం, జె.ఆర్.పురం, అరసవల్లి, గార, హిరమండలం, కొత్తూరు, నరసన్నపేట, కోటబొమ్మాళి, పలాస, కాశీబుగ్గ, ఇచ్చాపురం, సోంపేట, మందస కేంద్రాల్లో సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.
News February 28, 2026
శ్రీకాకుళం: ఆ మారణహోమం జరిగి నేటికి 15 ఏళ్లు పూర్తి

సంతబొమ్మాళి(M) కాకరపల్లి థర్మల్ ప్లాంట్ వ్యతిరేక పోరాటయోధులపై పోలీసులు కాల్పులు జరిపి నేటికి 15 ఏళ్లు పూర్తయింది. ఈస్ట్ కోస్ట్ సంస్థ తలపెట్టిన థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను వ్యతిరేకిస్తూ 2011 ఫిబ్రవరి 28వ తేదీన స్థానికులు ఆందోళన చేపట్టారు. వారిపై పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురు ఆందోళనకారులు మరణించగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం పర్యావరణ శాఖ ఈ ప్లాంట్ నిర్మాణాన్ని రద్దు చేసింది.


