News November 26, 2025
మన జిల్లా మార్కాపురం!

★ జిల్లా కేంద్రం: మార్కాపురం
★ నియోజకవర్గాలు: యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు
★ రెవెన్యూ డివిజన్లు: మార్కాపురం, కనిగిరి
★ జనాభా: 11 లక్షలు
★ మండలాలు (21): యర్రగొండపాలెం, రాచర్ల, కొమరోలు, త్రిపురాంతకం, వెలిగండ్ల, పుల్లలచెరువు, దోర్నాల, పెద్దారవీడు, హనుమంతునిపాడు, తర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల, కనిగిరి, పీసీపల్లి, సీఎస్‌పురం, పామూరు, కంభం, అర్ధవీడు, గిద్దలూరు, బేస్తవారపేట
Similar News
News February 3, 2026
చీరాలలో హత్య కేసులో ఐదుగురు నిందితులు అరెస్ట్

చీరాలలో గత నెల 27న రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ కింద జరిగిన హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చీరాల వన్ టౌన్ సీఐ సుబ్బారావు స్టేషన్ వద్ద మంగళవారం వివరాలు వెల్లడించారు. నిందితులు ఓ మహిళ విషయంలో జరిగిన ఘర్షణలో హత్య చేసినట్లు ఒప్పుకున్నారన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, బుధవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు వివరించారు.
News February 3, 2026
ప్రకాశం: యాక్సిడెంట్.. విద్యార్థి మృతి

రోడ్డు ప్రమాదంలో 9వ తరగతి విద్యార్థి వి. గాలెయ్య మృతి చెందగా మరో యువకుడు గాయాలపాలైన ఘటన సోమవారం రాత్రి జరిగింది. కొలుకుల నుంచి ఎర్రగొండపాలేనికి వస్తున్న సమయంలో వరి కోత వాహనం ఢీకొని అక్కడిక్కడే గాలెయ్య మృతి చెందగా.. సండ్రపాటి నాని (16) గాయాలపాలై ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు.
News February 3, 2026
ఒక్క మాటతో IPS.. కనిగిరి వాసి సక్సెస్ స్టోరీ..!

“నా తర్వాతి సివిల్స్ విజేత ఇతనే” అని పదేళ్లక్రితం IPS ఆవుల రమేశ్‌రెడ్డి ఓ వేదికపై చెప్పినమాట అక్షర సత్యమైంది. పవన్ కుమార్ రెడ్డి 179వ ర్యాంకుతో ఆంధ్రాలో IPSకు ఎంపికయ్యారు. మార్కాపురం జిల్లా కనిగిరి మండలం పునుగోడుకు చెందిన ఈయన ప్రభుత్వ ఉపాధ్యాయుడి కుమారుడు. అగ్రికల్చర్ ఆఫీసర్‌గా పనిచేస్తూనే నాలుగో ప్రయత్నంలో IPS సాధించారు. డాక్టర్ అవ్వాలనుకున్న ఈయన IPS రమేశ్ రెడ్డి ప్రోత్సాహంతో ఐపీఎస్ సాధించారు.


