News November 26, 2025
మన జిల్లా మార్కాపురం!

★ జిల్లా కేంద్రం: మార్కాపురం
★ నియోజకవర్గాలు: యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు
★ రెవెన్యూ డివిజన్లు: మార్కాపురం, కనిగిరి
★ జనాభా: 11 లక్షలు
★ మండలాలు (21): యర్రగొండపాలెం, రాచర్ల, కొమరోలు, త్రిపురాంతకం, వెలిగండ్ల, పుల్లలచెరువు, దోర్నాల, పెద్దారవీడు, హనుమంతునిపాడు, తర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల, కనిగిరి, పీసీపల్లి, సీఎస్‌పురం, పామూరు, కంభం, అర్ధవీడు, గిద్దలూరు, బేస్తవారపేట
Similar News
News January 31, 2026
ఫిబ్రవరి 2న కలెక్టర్ మీకోసం కార్యక్రమం రద్దు

ఫిబ్రవరి రెండవ తేదీన ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించే అవతరణ దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే కలెక్టర్ రాజాబాబు ఆదేశాలు జారీ చేశారు. తాత్కాలికంగా కలెక్టర్ మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
News January 30, 2026
23 ఏళ్లకే ప్రకాశం యువకుడికి గ్రూప్-2 ఉద్యోగం

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లికి చెందిన కసుకుర్తి కార్తిక్(23) ఒంగోలు IIIT క్యాంపస్‌లో B.Tech పూర్తిచేశాడు. అనంతరం గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతూ.. ఇటీవల విడుదల చేసిన గ్రూప్-2 తుది ఫలితాల్లో మొదటి ప్రయత్నంలోనే ASO (GAD)గా ఉద్యోగం పొందాడు. దీంతో ఉపాధ్యాయులు, తోటి స్నేహితులు, తల్లిదండ్రులు అభినందించారు. కార్తిక్ తండ్రి ట్రాక్టర్ డ్రైవర్ కాగా, తల్లి కూలీ పనులకు వెళ్తుంటారు.
News January 30, 2026
పోలీస్ డైరీని ఆవిష్కరించిన ప్రకాశం SP

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ పోలీస్ విధుల నిర్వహణకు సంబంధించిన డైరీని ఆవిష్కరించారు. రాష్ట్ర పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తయారుచేసిన డైరీని, పోలీస్ సంక్షేమ సమాచార దీపికను ఎస్పీ ఆవిష్కరించి సిబ్బందికి అందజేశారు. డైరీలో పోలీసు అధికారులకు, సిబ్బందికి అవసరమయ్యే అన్ని రకాల సమాచారాన్ని పొందుపరచడంపై ఎస్పీ అభినందనలు తెలిపారు.


