News November 26, 2025
పులివెందులలో YS జగన్ నేటి పర్యటన ఇలా..

మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండో రోజు పులివెందులలో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం వాసవీ ఫంక్షన్ హాలులో వివాహ వేడుకలో పాల్గొని, అనంతరం బ్రాహ్మణపల్లె వద్ద అరటి తోటలను పరిశీలించి రైతులతో చర్చిస్తారు. మధ్యాహ్నం లింగాల మాజీ సర్పంచ్ మహేష్‌రెడ్డి కుటుంబసభ్యులను, రామలింగారెడ్డిని పరామర్శిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం కానున్నారు.
Similar News
News November 26, 2025
పులివెందులలో జగన్.. విద్యార్థులతో సెల్ఫీ

కడప జిల్లా పర్యటనలో ఉన్న మాజీ సీఎం జగన్ ఇవాళ తన సొంత నియోజకవర్గంలో రైతులను పరామర్శించడానికి వెళ్లిన విషయం తెలిసిందే. జగన్ దారి మధ్యలో వెళ్తూ ప్రజలతో మమేకమై మాట్లాడుకుంటూ వెళ్లారు. అందులో ఆయనను కలవడానికి స్థానికంగా పిల్లలు వచ్చారు. వారితో ఆయన ఆప్యాయంగా మాట్లాడుతూ.. సెల్పీ తీసుకున్నారు. బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు.

నిరూపించండి.. రాజీనామా చేస్తా: MLC భూమిరెడ్డి

మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. బుధవారం అమరావతిలో ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లలో రాయలసీమకు అదనంగా ఒక్క ఎకరాకు నీరు ఇచ్చారా?, అరటి పంటకు బీమా ఎక్కడ చెల్లించాలో చెప్పాలని ప్రశ్నించారు. బీమా చెల్లించినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని జగన్‌కు ఆయన సవాల్ విసిరారు. జగన్ వల్లే పులివెందులలో బనానా ప్రాసెసింగ్ యూనిట్ మనుగడలోకి రాలేదన్నారు.