News April 17, 2024
అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం

శ్రీ సీతారాముల కళ్యాణానికి భద్రాచలం ముస్తాబైంది. చైత్ర శుద్ధ నవమి అభిషేక్ లగ్నం మధ్యాహ్నం 12 గంటలకు కాస్త అటు ఇటుగా రావడం పరిపాటి. ముహూర్త సమయం కాగానే వధూవరులైన సీతారాముల తలపై జీలకర్ర బెల్లం ఉంచుతారు. తరువాత శ్రీరామదాసు చేయించిన మూడు బొట్లు ఉన్న మంగళసూత్రానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మూడు సూత్రాలు ఉన్న తాళిని సీతమ్మ వారి మెడలో కట్టడంతో కళ్యాణ వేడుక కీలక ఘట్టం ముగుస్తుంది.
Similar News
News April 21, 2025
మధిర: వడదెబ్బకు సొమ్మసిల్లి వ్యక్తి మృతి

వడదెబ్బకు సొమ్మసిల్లి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మధిర మండలంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నిదానపురం గ్రామానికి చెందిన మేసిపోగు రత్తయ్య(33)మేకలు మేపేందుకు పొలానికి వెళ్లాడు. సోమవారం అధిక ఎండలతో మధ్యాహ్నం ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News April 21, 2025
CMRF స్కాం వెనుక RMPలదే ప్రధాన హస్తమా..?

ఖమ్మంలో CMRF స్కాం కలకలం రేపుతుంది. చికిత్స చేయకుండానే నకిలీ బిల్లులు సృష్టించి CMRF నిధులను దుర్వినియోగం చేసిన 10 ఆసుపత్రులను మూసివేసినట్లు DMHO వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ స్కాంలో RMPలదే ప్రధానహస్తంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం దీనిని సీరియస్గా తీసుకొని పూర్తిస్థాయిలో విచారణకు సిద్ధం అవుతుంది. అలాగే ఖమ్మంలోని మరికొన్ని ఆసుపత్రులపై కూడా నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
News April 21, 2025
ఖమ్మం:ఓపెన్ పరీక్షలు..139గైర్హాజర్

ఖమ్మం జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు పదో తరగతి పరీక్షలకు 488 మందికి గాను 420 మంది హాజరు కాగా 68 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్మీడియట్ పరీక్షకు 646 మందికి గాను 575 మంది హాజరు కాగా, 71మంది గైర్హాజరయ్యారని డీఈఓ సోమశేఖర శర్మ తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు.