News April 17, 2024
జహీరాబాద్‌లో త్రిముఖ పోరు?
ZHB లోక్‌సభ స్థానంలో త్రిముఖ పోరు నెలకొంది. కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పడిన ZHB పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటికీ 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో కాంగ్రెస్ (సురేశ్ షెట్కర్), 2014, 2019లో BRS (బీబీ పాటిల్) అభ్యర్థులు విజయం సాధించారు. ఈ సారి CONG, BJP, BRS అభ్యర్థులు ఎవరికి వారు ఎత్తులు పైఎత్తులు వేస్తూ ప్రచారం చేస్తుండడంతో సార్వత్రిక పోరు ఆసక్తి రేపుతోంది.
Similar News
News February 1, 2025
NZB: ఫేక్ యాప్‌తో మోసం.. ఇద్దరి అరెస్ట్
ఫేక్ యాప్‌లో ఆఫర్ల పేరిట అమాయకులను మోసం చేస్తున్న షేక్ అమిర్, సయ్యద్ ఇమ్రాన్ అలీ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు శనివారం ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి వివరాలు వెల్లడించారు. MGI యాప్ పేరుతో దాదాపుగా 12 మంది బాధితుల నుంచి రూ.2.40లక్షల నగదును కాజేశారని పేర్కొన్నారు. ఇలాంటి యాప్‌లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కేసు ఛేదనకు కృషి చేసిన పోలీసు అధికారులను ACP అభినందించారు.
News February 1, 2025
ధర్పల్లి: ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతి
దుబ్బాక గ్రామానికి చెందిన బొల్లారం సాయిలు అనే వ్యక్తి యూరియా కోసం ట్రాక్టర్ పై ధర్పల్లికి వెళ్తూ గ్రామ శివారులోని పసుపు పరిశోధన కేంద్రం సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో సాయిలు(52) అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ధర్పల్లి ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 1, 2025
‘కాంగ్రెస్ డిఫీట్.. కేసీఆర్ రిపీట్’: జీవన్ రెడ్డి
ఈ క్షణంలో ఎన్నికలు జరిగినా ‘కాంగ్రెస్ డిఫీట్.. కేసీఆర్ రిపీట్’ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ స్వయంగా నిర్వహించుకున్న పోల్ సర్వేలోనే తేటతెల్లమైందని ఆయన శనివారం పేర్కొన్నారు. కేసీఆర్ స్వర్ణ యుగం మళ్లీ రావాలన్నది తెలంగాణ ప్రజల హార్ట్ బీట్ అని ఆయన అభిప్రాయపడ్డారు.