News November 26, 2025
Op సిందూర్.. పాక్ దాడిని తిప్పికొట్టిన CISF

Op సిందూర్ సమయంలో J&Kలోని LOC వద్ద ఉన్న ఉరి హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్‌పై పాకిస్థాన్ దాడికి యత్నించిందని CISF ఓ ప్రకటనలో తెలిపింది. డ్రోన్ల అటాక్‌ను తమ భద్రతా సిబ్బంది సమర్థంగా తిప్పికొట్టారని, పాక్ రేంజర్ల కాల్పుల నుంచి పౌరులను సురక్షితంగా కాపాడారని వెల్లడించింది. మే 6న రాత్రి శత్రు దేశంతో పోరాడిన 19 మంది సిబ్బందికి నిన్న ఢిల్లీలో అవార్డుల ప్రదానం సందర్భంగా CISF ఈ మేరకు వివరాలు వెల్లడించింది.
Similar News
News November 26, 2025
సర్పంచ్ నామినేషన్లు.. ఇవి తప్పనిసరి

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రేపటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ పత్రంతో పాటు అభ్యర్థి ఫొటో, క్యాస్ట్, నో డ్యూస్, బర్త్ సర్టిఫికెట్లు, బ్యాంక్ అకౌంట్ నంబర్ జత చేయాలి. అఫిడవిట్‌లో అభ్యర్థి, ఇద్దరు సాక్షుల సంతకం ఉండాలి. డిపాజిట్ అమౌంట్ (SC, ST, BCలకు రూ.1,000, జనరల్‌కు రూ.2,000) చెల్లించాలి. Expenditure declaration సమర్పించాలి.
*Share It
News November 26, 2025
ఇప్పుడెందుకు క్రెడిట్ తీసుకుంటున్నావ్.. గంభీర్‌పై నెటిజన్ల ఫైర్

‘నా హయాంలోనే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచింది’ అని గంభీర్ చేసిన <<18393677>>తాజా కామెంట్లపై<<>> నెటిజన్లు మండిపడుతున్నారు. ‘2011 WC ఒక్కరి వల్లే గెలవలేదు. టీమ్, సపోర్ట్ స్టాఫ్ కృషి వల్లే అది సాధ్యమైంది. ఒక్క సిక్సర్ (ధోనీ కొట్టిన విన్నింగ్ షాట్)కు అంత ప్రాధాన్యం ఎందుకు?’ అని 2020లో గౌతీ ట్వీట్ చేశారు. ఇప్పుడు దాన్ని వైరల్ చేస్తూ ‘మరి ఇప్పుడెందుకు క్రెడిట్ తీసుకుంటున్నావ్’ అని ఫైరవుతున్నారు.
News November 26, 2025
రేపటి నుంచి RRB గ్రూప్ డీ పరీక్షలు

RRB గ్రూప్-D పరీక్షలను రేపటి నుంచి జనవరి 16 వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనుంది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు 4 రోజుల ముందు మెయిల్‌కు సమాచారం పంపిస్తారు. ఆతర్వాత అడ్మిట్ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్ష ద్వారా 32,438 పోస్టులను భర్తీ చేయనుంది. వెబ్‌సైట్: https://www.rrbcdg.gov.in/


