News April 17, 2024
అనంత: 18 నుంచి ఎస్కేయూలో ప్రీ Phd పరీక్షలు

అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 18 నుంచి 20 వరకూ ప్రీ పీహెచ్డీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ తెలిపారు. ఎస్కేయూ లోని కెమిస్ట్రీ గ్యాలరీలో పరీక్షలు జరుగుతాయన్నారు. అలాగే మే 4 నుంచి ఎస్కేయూ పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఆరంభమవుతాయని తెలిపారు.
Similar News
News September 11, 2025
అనంత జిల్లాలో వర్షం.. పిడుగులు పడే అవకాశం..!

అనంతపురం జిల్లాలో ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని APSDMA పేర్కొంది. ‘ఇప్పటికే మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చేటప్పుడు చెట్లు, టవర్స్, విద్యుత్ స్తంభాలు, పొలాలు, బహిరంగ ప్రదేశాలలో ఉండకూడదు. సురక్షితమైన ప్రాంతాలలో ఆశ్రయం పొందాలి’ అంటూ ఫోన్లకు సందేశాలు పంపింది. ఇలాంటి మెసేజ్ మీకు కూడా వచ్చిందా అయితే కామెంట్ చేయండి.
News September 10, 2025
రైతులు అధైర్య పడకండి.. యూరియా కొరత లేదు: కలెక్టర్

అనంతపురం జిల్లాలో రైతులు ఇబ్బందులు పడకుండా యూరియాను సక్రమంగా అందిస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లాలో వివిధ రైతు సేవా కేంద్రాల్లో 298 మెట్రిక్ టన్నులు, సొసైటీలలో 92, ప్రైవేట్ డీలర్ల వద్ద 448 మెట్రిక్ టన్నులు, హోల్సేల్ డీలర్లు & AP Markfed వద్ద 1069 మెట్రిక్ టన్నులు, రవాణా కింది 519 మెట్రిక్ టన్నులు మొత్తంగా జిల్లాలో 2,426 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు.
News September 9, 2025
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్ ఇదే

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనంతపూరం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపు మధ్యాహ్నం 12:40 గంటలకు పుట్టపర్తి సత్య సాయిబాబా విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం చేరుకుంటారు. ఇంద్రప్రస్థ మైదానంలో జరిగే ‘సూపర్-6 సూపర్ హిట్’ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.