News November 26, 2025
బూర్గంపాడు: అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్య

రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించిన అథ్లెట్, అంగన్వాడీ కార్యకర్త బింగి కృష్ణవేణి(42) అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడింది. బూర్గంపాడు మండలం కోయగూడెం గ్రామానికి చెందిన ఆమె.. ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో గొడవల కారణంగా మనస్తాపానికి గురై సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో ఎస్ఐ ప్రసాద్ కేసు నమోదు చేశారు.
Similar News
News November 26, 2025
మంచిర్యాల: ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

2వ సాధారణ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదుని సూచించారు. హైదరాబాదు నుంచి అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడిబందీగా అమలు జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
News November 26, 2025
మెదక్: ఏడుపాయల టెండర్ ఆదాయం రూ.3.75 లక్షలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గాభవాని దేవస్థానం కార్యాలయంలో బుధవారం మహా శివరాత్రి జాతర సీల్ టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించారు. ఈఓ చంద్రశేఖర్, మెదక్ జిల్లా దేవాదాయ శాఖ పరివేక్షకుడు వెంకట రమణ సమక్షంలో వేలం జరిగింది. జాతరలో కొబ్బరి ముక్కలు పోగు హక్కు రూ.3.75 లక్షలకు నాగ్సాన్‌పల్లి పి.మల్లేశం దక్కించుకున్నారు. మిగతా టెండర్లకు సరైన పాటలు రాక వాయిదా వేసినట్టు అధికారులు తెలిపారు.
News November 26, 2025
పెద్దపల్లి: దీక్ష దివస్‌పై బీఆర్‌ఎస్ నాయకుల సమీక్ష

‘దీక్ష దివస్’ సందర్భంగా పెద్దపల్లి బీఆర్‌ఎస్ పార్టీ భవన్‌లో కేటీఆర్ ఆదేశాల మేరకు నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అధ్యక్షత వహించగా, దాసరి మనోహర్ రెడ్డి ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ దీక్షలు పునాది అయ్యాయని మనోహర్ రెడ్డి గుర్తుచేశారు. ఈ సమావేశంలో పుట్ట మధు, రఘువీర్ సింగ్, గంట రాములు యాదవ్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


