News November 26, 2025

సిద్దిపేట: సమయం లేదు మిత్రమా.. పరిగెత్తాల్సిందే !

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగడంతో పల్లెల్లో సందడి నెలకొంది. ఎన్నికల తేదీలు దగ్గరే ఉండడంతో ఆశావాహులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. జిల్లాలో 508 గ్రామ పంచాయతీలు, 4,508 వార్డులు ఉండగా తొలి విడతలో దౌల్తాబాద్, గజ్వేల్, జగదేవ్పూర్, మర్కుక్, ములుగు, రాయపోల్, వర్గల్ మండలాల్లోని 163 జీపీలు,1,432 వార్డులకు డిసెంబర్ 11న ఎన్నికలు జరగనున్నాయి.

Similar News

News November 26, 2025

ప్రకాశం: తుఫాన్‌ను లెక్కచేయని వనిత.. అసలు స్టోరీ ఇదే!

image

నాగులుప్పలపాడు మండలం పోతవరానికి చెందిన మహిళా రైతు వనిత.. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 2021 నుంచి ఇదే పద్ధతి పాటిస్తున్న ఆమె అద్భుత విజయాలు సాధించారు. ప్రస్తుతం మొక్కజొన్న, కంది, బీరకాయ పంటలను 2.20 ఎకరాల భూమిలో సాగు చేశారు. మొన్న మొంథా తుఫాన్‌తో మిగిలిన రైతుల పంట దెబ్బతింటే, ఈమె పంట సేఫ్. దీంతో రూ.8500 పెట్టుబడి ఖర్చుకు రూ.53,460 ఆదాయం గడించారు.

News November 26, 2025

భద్రాద్రిలో బీసీలకు ఛాన్సే లేదు..!

image

జీఓ నెం.46 విడుదల చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం సరైన పద్ధతి కాదని బీసీ జేఏసీ కన్వీనర్ సత్యనారాయణ అన్నారు. బుధవారం అమరవీరుల స్థూపం వద్ద నిరసన తెలిపి ఆయన మాట్లాడారు. భద్రాద్రి జిల్లాలో బీసీలకు ఒక్క సర్పంచ్ సీటు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు అయ్యేంతవరకు ఎన్నికలు ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.

News November 26, 2025

రాజ్యాంగ రూపకల్పనలో అతివలు

image

భారత రాజ్యాంగాన్ని లిఖితపూర్వకంగా, క్రమ పద్ధతిలో ఒక గ్రంథంగా రూపొందించారు. దీన్ని భారత రాజ్యాంగ పరిషత్ 1946, డిసెంబరు 9 నుంచి 1949, నవంబరు 26 వరకు అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంలో రూపొందించింది. దీంట్లో గౌరీ భంజా చోళ కాంస్య నటరాజ విగ్రహ రూపాన్ని రాజ్యాంగంలో చిత్రీకరించారు. అలాగే జమునా సేన్, నిబేదిత బోస్, అమలా సర్కార్, బాని పటేల్ కూడా రాజ్యాంగంలోని పలు ఇల్యుస్ట్రేషన్లు చిత్రీకరించారు.