News November 26, 2025
లైన్‌క్లియర్: HYDలో అండర్ గ్రౌండ్ నుంచి కేబుల్స్!

విద్యుత్ సరఫరా సమస్యలు పరిష్కరించేందుకు TGSPDCL చర్యలకు ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అండర్ గ్రౌండ్ కేబుల్స్ తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు పంపగా తాజాగా మంత్రివర్గం ఇందుకు ఆమోదం తెలిపింది. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం రూ.14,725 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. ఇది సక్సెస్ అయితే సిటీలో కరెంట్ పోల్స్, వేలాడుతోన్న వైర్ల సమస్యకు తెర పడనుంది.
Similar News
News November 26, 2025
నగరం.. మహానగరం.. విశ్వనగరం

అప్పట్లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. ఇదీ సిటీ పరిస్థితి. ఇక ఔటర్ చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు గ్రేటర్లో కలిసిన తర్వాత విశ్వనగరంగా మారనుంది. జనాభా కూడా భారీగానే పెరిగే అవకాశముంది. ప్రస్తుతం గ్రేటర్ జనాభా 1.40 కోట్లు ఉండగా విలీనం తర్వాత 1.70 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది.
News November 26, 2025
శివారులో మాయమైపోతున్నయమ్మ పల్లెలు

దేశానికి పల్లెలే పట్టుగొమ్మలని పెద్దలు చెప్పేవారు.. అయితే ఇపుడు నగర శివారులో ఉన్న పల్లెలు మాయమవుతున్నాయి. అవి పట్నాలుగా కాదు.. ఏకంగా నగరంగా మారిపోతున్నాయి. సిటీ చుట్టుపక్కల ఉన్న పల్లెలు, మున్సిపాలిటీలను ప్రభుత్వం GHMCలో విలీనం చేస్తూనే ఉంది. అప్పట్లో 55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న హైదరాబాద్ నగరం 2వేల చదరపు కిలోమీటర్లున్న నగరంగా మారుతోందంటే ఎన్ని పల్లెలు మాయమై ఉంటాయో ఆలోచించండి.
News November 26, 2025
HYD: లోకల్ బాడీల్లో BRS ‘డబుల్ స్ట్రాటజీ’

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓటమి తర్వాత, GP ఎలక్షన్స్‌లో గెలవడానికి BRS ప్రయత్నాలు మొదలెట్టింది. కాంగ్రెస్ పాలనలో GPలకు నిధుల కొరత, 42% BC కోటా అమలులో వైఫల్యాలని చెబుతూ ప్రచారంలో మెయిన్ ఎజెండాగా ప్లాన్ చేసింది. 2వ ఎజెండా ప్రభుత్వంలో అవినీతిని ఎత్తిచూపడం. KTR ఇప్పటికే ‘HILT’ పాలసీలో లక్షల కోట్ల స్కామ్ జరుగుతోందని లేవనెత్తారు. వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చింది.


