News November 26, 2025

NGKL: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం

image

NGKLలో ప్రభుత్వ (డిగ్రీ ఆర్ట్స్ అండ్ కామర్స్) కళాశాలలో నేడు పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ 76వ వార్షికోత్సవం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా.గీతాంజలి హాజరయ్యారు.అనంతరం పొలిటికల్ సైన్స్ విభాగం అధ్యాపకుడు నరేష్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి స్వేచ్ఛ, హక్కులు, అవకాశాలు, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు లభించడానికి కారణం రాజ్యాంగం అని అన్నారు.

Similar News

News November 26, 2025

సర్పంచ్ నామినేషన్లు.. ఇవి తప్పనిసరి

image

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రేపటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ పత్రంతో పాటు అభ్యర్థి ఫొటో, క్యాస్ట్, నో డ్యూస్, బర్త్ సర్టిఫికెట్లు, బ్యాంక్ అకౌంట్ నంబర్ జత చేయాలి. అఫిడవిట్‌లో అభ్యర్థి, ఇద్దరు సాక్షుల సంతకం ఉండాలి. డిపాజిట్ అమౌంట్ (SC, ST, BCలకు రూ.1,000, జనరల్‌కు రూ.2,000) చెల్లించాలి. Expenditure declaration సమర్పించాలి.
*Share It

News November 26, 2025

మహబూబ్‌నగర్‌లో 3 విడతలుగా పంచాయతీ ఎన్నికలు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. జిల్లాలోని 16 మండలాల పరిధిలో మొత్తం 423 గ్రామ పంచాయతీలు, 3,674 వార్డులు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికల నియమావళిని ఎవరూ ఉల్లంఘించవద్దని జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు.
#SHARE IT.

News November 26, 2025

సిరిసిల్ల: ‘టీ పోల్‌లో పంచాయతీ రిజర్వేషన్ వివరాలు’

image

గ్రామ పంచాయతీల రిజర్వేషన్ వివరాలు టీ-పోల్‌లో అప్‌లోడ్ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేసేందుకు ఎఫ్.ఎస్.టి, ఎస్.ఎస్.టీ బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఎం.సి.ఎం.సి , మీడియా సెల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ శేషాద్రి పాల్గొన్నారు.