News November 26, 2025
SBI సరికొత్త రికార్డు.. షేర్ వాల్యూ@రూ.999

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI సరికొత్త రికార్డు నమోదుచేసింది. ఇవాళ సంస్థ స్టాక్ దాదాపు 3 శాతం పెరగడంతో విలువ ఆల్‌టైమ్ హై రూ.999కి చేరింది. స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.1000 కూడా దాటొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా సంస్థ వ్యాపార విలువ రూ.100 లక్షల కోట్లకు చేరినట్లు ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
Similar News
News November 28, 2025
ఈ విచిత్రాన్ని గమనించారా?

ప్రపంచంలో చాలా చోట్ల భవనాలు, హోటళ్లు, హాస్పిటల్ బిల్డింగ్స్‌లో 13వ అంతస్తు ఉండదనే విషయం మీకు తెలుసా? ‘ట్రిస్కైడెకాఫోబియా’ వల్ల చాలామంది 13వ అంకెను అశుభంగా భావిస్తారు. ఈ అపోహ వల్ల ఎవరూ 13వ అంతస్తులో ఉండేవారు కాదట. వ్యాపార నష్టం జరగొద్దని నిర్మాణదారులు 13కు బదులుగా 12Aను వేస్తారని వినికిడి. చాలాచోట్ల ICU బెడ్స్‌కి కూడా 13 లేకుండా 14 రాస్తారని వైద్యులు చెబుతున్నారు. మీరు ఇది గమనించారా?
News November 28, 2025
కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు

‘దిత్వా’ తుఫాన్ ప్రభావంతో కోస్తా, రాయలసీమలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. ‘నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో తుఫాన్ నెమ్మదిగా కదులుతోంది. గడచిన 6hrsలో 4kms వేగంతో కదులుతూ పుదుచ్చేరికి 420kms, చెన్నైకి 520kms దూరంలో కేంద్రీకృతమైంది. ఎల్లుండి నైరుతి బంగాళాఖాతం ఉత్తర TN, పుదుచ్చేరి, ద.కోస్తా తీరాలకు చేరుకునే అవకాశముంది’ అని ఓ ప్రకటనలో పేర్కొంది.
News November 28, 2025
DEC 13న HYDకు మెస్సీ: CM రేవంత్

TG: తన G.O.A.T. టూర్ లిస్టులో హైదరాబాద్ కూడా యాడ్ అయ్యిందని ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం రేవంత్ స్పందించారు. ‘డిసెంబర్ 13న హైదరాబాద్‌కి మెస్సీని స్వాగతించేందుకు ఎదురు చూస్తున్నాను. మా గడ్డ మీద మీలాంటి ఫుట్‌బాల్ స్టార్‌ని చూడాలని కలలుగన్న ప్రతి అభిమానికి ఇది ఎగ్జైటింగ్ మూమెంట్. మీకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ సగర్వంగా సిద్ధమైంది’ అని ట్వీట్ చేశారు.


