News November 26, 2025

సిద్దిపేట: సమయం లేదు మిత్రమా.. పరిగెత్తాల్సిందే !

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగడంతో పల్లెల్లో సందడి నెలకొంది. ఎన్నికల తేదీలు దగ్గరే ఉండడంతో ఆశావాహులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. జిల్లాలో 508 గ్రామ పంచాయతీలు, 4,508 వార్డులు ఉండగా తొలి విడతలో దౌల్తాబాద్, గజ్వేల్, జగదేవ్పూర్, మర్కుక్, ములుగు, రాయపోల్, వర్గల్ మండలాల్లోని 163 జీపీలు,1,432 వార్డులకు డిసెంబర్ 11న ఎన్నికలు జరగనున్నాయి.

Similar News

News November 26, 2025

మంచిర్యాల: ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

image

2వ సాధారణ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదుని సూచించారు. హైదరాబాదు నుంచి అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడిబందీగా అమలు జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.

News November 26, 2025

మెదక్: ఏడుపాయల టెండర్ ఆదాయం రూ.3.75 లక్షలు

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గాభవాని దేవస్థానం కార్యాలయంలో బుధవారం మహా శివరాత్రి జాతర సీల్ టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించారు. ఈఓ చంద్రశేఖర్, మెదక్ జిల్లా దేవాదాయ శాఖ పరివేక్షకుడు వెంకట రమణ సమక్షంలో వేలం జరిగింది. జాతరలో కొబ్బరి ముక్కలు పోగు హక్కు రూ.3.75 లక్షలకు నాగ్సాన్‌పల్లి పి.మల్లేశం దక్కించుకున్నారు. మిగతా టెండర్లకు సరైన పాటలు రాక వాయిదా వేసినట్టు అధికారులు తెలిపారు.

News November 26, 2025

పెద్దపల్లి: దీక్ష దివస్‌పై బీఆర్‌ఎస్ నాయకుల సమీక్ష

image

‘దీక్ష దివస్’ సందర్భంగా పెద్దపల్లి బీఆర్‌ఎస్ పార్టీ భవన్‌లో కేటీఆర్ ఆదేశాల మేరకు నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అధ్యక్షత వహించగా, దాసరి మనోహర్ రెడ్డి ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ దీక్షలు పునాది అయ్యాయని మనోహర్ రెడ్డి గుర్తుచేశారు. ఈ సమావేశంలో పుట్ట మధు, రఘువీర్ సింగ్, గంట రాములు యాదవ్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.