News November 26, 2025

సిద్దిపేట: కలెక్టరేట్‌లో భారత రాజ్యాంగ దినోత్సవం

image

సిద్దిపేట జిల్లా ఐడీఓసీ సమావేశ మందిరంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హైమావతి ముఖ్య అతిథిగా హాజరై, కార్యాలయంలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి రాజ్యాంగ ప్రతిజ్ఞను చదివించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్యం ప్రాధాన్యతను, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.

Similar News

News November 26, 2025

రాజమండ్రి: గోదావరి పుష్కరాలపై ఎంపీ దగ్గుబాటి కీలక ఆదేశాలు

image

గోదావరి పుష్కరాల దృష్ట్యా ఎన్‌హెచ్–365బీబీ అప్‌గ్రేడేషన్ పనులను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయాలని రాజమండ్రి ఎంపీ డాక్టర్ దగ్గుబాటి పురందీశ్వరి ఆదేశించారు. బుధవారం తూర్పు గోదావరి కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో రాజమండ్రి కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం జరిగింది. ప్రాజెక్ట్ పురోగతి, భూ సేకరణ, క్లియరెన్సులు, నిర్మాణ సంస్థల పనితీరుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

News November 26, 2025

యువత చేతిలో ఊరి భవిష్యత్తు.. నిలబడతారా?

image

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ఇన్నేళ్లుగా ఊరిలో ఎలాంటి మార్పు జరగలేదని నాయకుల తీరుపై నిరాశ చెందిన యువతకు ఇదే సువర్ణావకాశం. గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే పట్టుదల, కొత్త ఆలోచనలున్న యువత ముందుకొచ్చి పోటీలో నిలబడాలి. మీ ప్రణాళికలతో, మాటతీరుతో ప్రజలను ఒప్పించి, వారి నమ్మకాన్ని గెలుచుకుంటే విజయం మీదే. స్వచ్ఛత, సంక్షేమం, ప్రగతితో గ్రామాలను ఆదర్శంగా మార్చుకోవచ్చు.

News November 26, 2025

నిగ్గు తేల్చేందుకు విచారణ కమిటీ: ప్రకాశం కలెక్టర్

image

ఒంగోలులోని మెప్మా ప్రాజెక్టు పరిధిలో అవినీతి కార్యకలాపాలకు పలువురు సిబ్బంది పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ రాజాబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మెప్మా ప్రాజెక్టు పరిధిలో జరిగిన అసలు విషయాన్ని వెలుగులోకి తెచ్చేందుకు జేసీ గోపాలకృష్ణ అధ్యక్షతన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 2 వారాల్లో నివేదికను సమర్పించనుంది. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.