News November 26, 2025

గొల్లగూడెంలో CM పర్యటన.. భద్రత ఏర్పాట్లు పరిశీలించిన SP

image

ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో డిసెంబర్ 1న సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఎస్పీ ప్రతాప్ కిషోర్ భద్రత ఏర్పాట్లు పరిశీలించి అధికారులకి కీలక సూచనలు చేశారు. వాహనాల మళ్లింపు, పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పర్యటన ప్రశాంతంగా, సురక్షితంగా ముగిసేలా ప్రతి అధికారి బాధ్యత వహించాలని ఆదేశించారు.

Similar News

News November 26, 2025

ప్రెగ్నెన్సీలో మాయ ఇలా ఉందా?

image

ప్రెగ్నెన్సీలో మాయ, శిశువు రక్తనాళాలు రక్షణ లేకుండా గర్భాశయ ముఖద్వారానికి దగ్గరగా ఉండటాన్నే వాసా ప్రీవియా అంటారు. దీనివల్ల డెలివరీ సమయంలో తల్లీబిడ్డలిద్దరికీ ప్రాణాపాయం ఏర్పడొచ్చు. ఈ పరిస్థితి ఉంటే నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. కొన్నిసార్లు సీ సెక్షన్ చేయాల్సి రావొచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు చెకప్స్ చేయించుకొని దీన్ని ముందుగానే గుర్తిస్తే ప్రమాదాన్ని తగ్గించొచ్చని నిపుణులు చెబుతున్నారు.

News November 26, 2025

మంచిర్యాల: ఈ నెల 29న దివ్యాంగుల ఆటల పోటీలు

image

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం- 2025ను పురస్కరించుకొని దివ్యాంగుల జిల్లా స్థాయి ఆటల పోటీలను ఈ నెల 29న మంచిర్యాల ZPHS మైదానంలో నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ తెలిపారు. జిల్లాలోని జూనియర్, సీనియర్ దివ్యాంగులందరికీ పోటీలు నిర్వహిస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే వారు సదరం, ఆధార్ కార్డు తీసుకురావాలన్నారు. విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు.

News November 26, 2025

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడ్ రేట్ల కోత వార్తలు, క్రూడాయిల్ ధరల తగ్గుదల, FIIల కొనుగోళ్ల నేపథ్యంలో ఎగిశాయి. నిఫ్టీ 320.5 పాయింట్లు ఎగసి 26,205 వద్ద, సెన్సెక్స్ 1022.5 పాయింట్ల లాభంతో 85,609 వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, రిలయన్స్, సన్ ఫార్మా, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, INFY, TechM, మారుతీ, HDFC బ్యాంక్ ఎగిశాయి.