News November 26, 2025
HYD: ఎందుకీ విలీనం.. ప్రజలకేం ప్రయోజనం!

నగరం చుట్టూ ఉన్న 27 మున్సిపాల్టీలను GHMCలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ఈ ప్రక్రియ ముగియనుంది. అయితే ఈ విలీనం వల్ల ప్రజలకేం ప్రయోజనం? అని సామాన్యుల మదిలో మెదిలో ప్రశ్న. గతేడాది గ్రామాలను మున్సిపాలకటీల్లో కలిపిన సర్కారు.. ఇపుడు మున్సిపాలిటీలను గ్రేటర్‌లో కలపాలని నిర్ణయించింది. మా పల్లెలను GHMCలో కలిపితే మాకు వచ్చే ప్రయోజనం ఏమిటి? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
Similar News
News November 28, 2025
NZB: రెండో రోజు 450 నామినేషన్లు

నిజామాబాద్ జిల్లాలో మొదటి విడతలో జరగనున్న GP ఎన్నికల్లో రెండో రోజు శుక్రవారం 184 సర్పంచి స్థానాలకు 164 నామినేషన్లు, 1,642 వార్డు మెంబర్ల స్థానాలకు 286 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు వెల్లడించారు. మొదటి విడతలో బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పొతంగల్, రెంజల్, రుద్రూర్, సాలుర, ఎడపల్లి, నవీపేట మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
News November 28, 2025
భువనగిరి: ఆర్టీసీ బస్సు ఢీకొని రైతు మృతి

ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం పోయిన ఘటన భువనగిరి మండల పరిధిలో జరిగింది. కుమ్మరిగూడెంకు చెందిన లక్ష్మయ్య అనే రైతు పొలం వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా, హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 28, 2025
వరంగల్: కాళోజీ ఉపకులపతిపై వేటు..?

కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నందకుమార్ రెడ్డిపై వేటు వేసినట్టు తెలిసింది. కాళోజీ వర్సిటీ వ్యవహారాలపై వరుస కథనాలు Way2Newsలో రావడంతో ఇంటెలిజెన్సు రిపోర్టును సీఎం కోరారు. నిఘా సంస్థలు ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రాథమికంగా వీసీని తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే సీఎంవోకు సమగ్ర నివేదిక అందడంతో వేటు పడినట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


