News November 26, 2025

పెద్దపల్లి: జిల్లా కలెక్టర్‌తో రాణి కుముదిని VC

image

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆమె జిల్లా కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇందులో పాల్గొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, నోటిఫికేషన్ ప్రకటన, టీపోల్ అప్డేట్లు, ఎన్నికల నియమావళి అమలు పటిష్ఠంగా ఉండాలని కమిషనర్ సూచించారు.

Similar News

News November 27, 2025

తీవ్ర అల్పపీడనం.. అతి భారీ వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా బలపడుతుందని APSDMA వెల్లడించింది. ఇది ఈ నెల 29 నాటికి తమిళనాడు, దక్షిణ కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రేపు మోస్తరు వర్షాలు, ఎల్లుండి రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో భారీ వానలు కురుస్తాయని పేర్కొంది. తీరం వెంట గంటకు 50-70KM వేగంతో గాలులు వీస్తాయంది.

News November 27, 2025

VKB: దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని క్రీడా పోటీలు

image

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈనెల 28న వికారాబాద్‌లోని బ్లాక్ గ్రౌండ్‌లో దివ్యాంగుల కోసం క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వికలాంగుల సంక్షేమ అధికారి కృష్ణవేణి తెలిపారు. ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు. క్యారమ్, జావెలిన్, రన్నింగ్, షార్ట్‌పుట్ వంటి క్రీడలు ఉంటాయని పేర్కొన్నారు. వివరాలకు 81794 32874 లేదా 90007 78300 సంప్రదించాలన్నారు.

News November 27, 2025

నేడే మెగా వేలం

image

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) మెగా ఆక్షన్ నేడు ఢిల్లీలో జరగనుంది. 277 మంది అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 194 మంది భారత ప్లేయర్లు ఉన్నారు. మహిళల వరల్డ్ కప్‌లో రాణించిన దీప్తీ శర్మ, రేణుక, వోల్వార్ట్ తదితరులు భారీ ధర దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఇవాళ వేలంలోకి వచ్చే క్రికెటర్లలో దియా యాదవ్(16), భారతి సింగ్(16) తక్కువ వయస్సుగల వారు కాగా, SA ప్లేయర్ షబ్నిమ్(37)ఓల్డెస్ట్ క్రికెటర్.