News November 26, 2025
గ్లోబల్ సమ్మిట్: పెట్టుబడిదారుల దృష్టికి సౌకర్యాల జాబితా

డిసెంబర్ 8, 9 తేదీల్లో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలనూ చేస్తోంది. ముఖ్యంగా ఇక్కడ సర్కారు కల్పించనున్న సౌకర్యాలను వారికి కూలంకుషంగా వివరించనుంది. ORR, RRR, IRR, గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి, బందర్ పోర్టు వరకు మార్గం, కొత్తగా నిర్మించే రైలు మార్గాలు తదితరాలను వారికి అర్థమయ్యేలా ప్రొజెక్ట్ చేయనుంది. ఎప్పుడూ.. ఎక్కడా.. ఎలాంటి సమస్యలు రానివ్వబోమని కచ్చితమైన హామీ ఇవ్వనుంది.
Similar News
News November 26, 2025
HYD: ఇంద్రజాల్ డ్రోన్ వాహనం

ఇంద్రజాల్ రేంజర్ వాహనాన్ని రాయదుర్గం టీ హబ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఇంద్రజాల్ రేంజర్ వాహనం అనుమానాస్పద డ్రోన్లను కూల్చేస్తుందని, 6 రోజుల్లో 70 డ్రోన్లను నిర్వీర్యం చేసిందని, ఈ వాహనం 10 కిలోమీటర్ల రేడియస్‌లో పనిచేస్తుందన్నారు. ఈ వాహనం డిఫెన్స్ డ్రోన్ కాకుండా డ్రగ్స్ తీసుకొస్తున్న డ్రోన్స్‌ను కూడా నిర్వీర్యం చేస్తుందని డ్రోన్ డిఫెన్స్ ఇండియా సీఈవో కిరణ్ రాజు తెలిపారు.
News November 26, 2025
సూర్యాపేట: ‘ప్రతి పౌరుడు రాజ్యాంగ నిబంధనలను పాటించాలి’

ప్రతి పౌరుడు రాజ్యాంగ నిబంధనలను పాటించాలని జిల్లా కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి అధికారులతో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి పౌరుడు రాజ్యాంగ నిబంధనలకు లోబడి పని చేయాలని, రాజ్యాంగ హక్కులను కాపాడాలన్నారు.
News November 26, 2025
భట్టి కుమారుడి ఎంగేజ్‌మెంట్.. హాజరైన సీఎం

TG: హైదరాబాద్‌లో జరిగిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య నిశ్చితార్థ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సతీమణి, కూతురు, అల్లుడితో కలిసి వచ్చిన సీఎం.. కాబోయే వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు చెప్పారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ముఖ్య నేతలు, అధికారులు ఈ వేడుకకు హాజరయ్యారు.


