News November 26, 2025

గద్వాల: ప్రభుత్వ భవనాలపై రాతలు నిషేధం: కలెక్టర్

image

జీపీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ భవనాలు, ఎలక్ట్రిక్ పోల్స్, నియంత్రికల గోడలపై రాజకీయ ప్రచారాలు రాయడం, పోస్టర్లు అతికించడం నిషేధమని కలెక్టర్ సంతోష్ స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆస్తులపై రాతలకు యజమానుల అనుమతి తప్పక తీసుకోవాలని సూచించారు. సర్పంచ్ అభ్యర్థులు ప్రచారానికి ఉపయోగించే వాహనాలకు తహశీల్దార్ల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

Similar News

News November 26, 2025

RRR కేసు.. ఐపీఎస్‌ పీవీ సునీల్‌కుమార్‌కు సిట్‌ నోటీసులు

image

ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కస్టడీలో ‘థర్డ్ డిగ్రీ’ ప్రయోగించారన్న కేసులో మాజీ సీఐడీ చీఫ్, ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌కు గుంటూరు సిట్ బుధవారం నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 4న విచారణకు హాజరుకావాలని అందులో స్పష్టం చేసింది. 2021లో రాజద్రోహం కేసు విచారణ సమయంలో తనను కస్టడీలో హింసించి, హత్యకు కుట్ర పన్నారన్న రఘురామ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

News November 26, 2025

విశాఖలో ఆత్మహత్య చేసుకున్న అల్లూరి విద్యార్థిని

image

అల్లూరి జిల్లా విద్యార్థిని విశాఖపట్నంలో బుధవారం ఆత్మహత్య చేసుకుంది. హుకుంపేట మండలం రాప గ్రామానికి చెందిన శోభ నందిని (19) కృష్ణా కాలేజీలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. మద్దిలపాలెంలో అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు పోలీసులు నందని కుటుంబ సభ్యులుకు సమాచారం తెలియజేశారు. మృతురాలి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు.

News November 26, 2025

మంచిర్యాల: నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలి

image

రాష్ట్రంలో 2వ సాధారణ పంచాయితీ ఎన్నికల నిర్వహణలో నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కార్యాలయంలో శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. నామినేషన్ ప్రక్రియ నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల పరిశీలన, పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా, ఫలితాలు వంటి ప్రతి అంశంపై అప్రమత్తంగా ఉండాలన్నారు.