News November 26, 2025
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది: KMR కలెక్టర్

కామారెడ్డి జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరుగుతుందని చెప్పారు. తొలి విడత నామినేషన్లు NOV 27నుంచి ప్రారంభమవుతాయి. ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లు నిఘా ఉంచుతాయని, ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
Similar News
News November 26, 2025
RRR కేసు.. ఐపీఎస్ పీవీ సునీల్‌కుమార్‌కు సిట్ నోటీసులు

ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కస్టడీలో ‘థర్డ్ డిగ్రీ’ ప్రయోగించారన్న కేసులో మాజీ సీఐడీ చీఫ్, ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్‌కు గుంటూరు సిట్ బుధవారం నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 4న విచారణకు హాజరుకావాలని అందులో స్పష్టం చేసింది. 2021లో రాజద్రోహం కేసు విచారణ సమయంలో తనను కస్టడీలో హింసించి, హత్యకు కుట్ర పన్నారన్న రఘురామ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
News November 26, 2025
విశాఖలో ఆత్మహత్య చేసుకున్న అల్లూరి విద్యార్థిని

అల్లూరి జిల్లా విద్యార్థిని విశాఖపట్నంలో బుధవారం ఆత్మహత్య చేసుకుంది. హుకుంపేట మండలం రాప గ్రామానికి చెందిన శోభ నందిని (19) కృష్ణా కాలేజీలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. మద్దిలపాలెంలో అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు పోలీసులు నందని కుటుంబ సభ్యులుకు సమాచారం తెలియజేశారు. మృతురాలి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు.
News November 26, 2025
మంచిర్యాల: నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలి

రాష్ట్రంలో 2వ సాధారణ పంచాయితీ ఎన్నికల నిర్వహణలో నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కార్యాలయంలో శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. నామినేషన్ ప్రక్రియ నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల పరిశీలన, పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా, ఫలితాలు వంటి ప్రతి అంశంపై అప్రమత్తంగా ఉండాలన్నారు.


