News November 26, 2025
రాజన్న హుండీ ఆదాయం రూ. 94,29,209/-

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానానికి హుండీ ద్వారా రూ 94,29,209/- ఆదాయం సమకూరింది. గత వారం రోజుల ఆదాయాన్ని బుధవారం లెక్కించగా నగదు రూపంలో రూ.94,29,209/-, మిశ్రమ బంగారం 067 గ్రాముల 500 మిల్లీగ్రాములు, మిశ్రమ వెండి 4 కిలోలు లభించినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఆలయ సిబ్బంది, వాలంటీర్లు లెక్కింపులో పాల్గొన్నారు.
Similar News
News November 27, 2025
ఆన్‌లైన్ కంటెంట్ చూసేందుకు ఆధార్‌తో ఏజ్ వెరిఫికేషన్?

OTT/ఆన్‌లైన్ కంటెంట్‌పై సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది. అశ్లీలంగా భావించే కంటెంట్ విషయంలో ఆధార్ ద్వారా ఏజ్ వెరిఫికేషన్ చేయవచ్చని చెప్పింది. ‘షో ప్రారంభంలో వేసే హెచ్చరిక కొన్నిక్షణాలే ఉంటుంది. తర్వాత కంటెంట్ ప్రసారం కొనసాగుతుంది. అందుకే ఆధార్ వంటి వాటితో వయసు ధ్రువీకరించాలి. ఇది సూచన మాత్రమే. పైలట్ ప్రాతిపదికన చేపట్టాలి. మనం బాధ్యతాయుత సొసైటీని నిర్మించాలి’ అని CJI జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు.
News November 27, 2025
అంతర్ జిల్లాల ఫుట్ బాల్ విజేత ANU కాలేజ్

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అంతర్ జిల్లాల ఫుట్ బాల్ పోటీలు అత్యంత రసవత్తరంగా జరుగుతున్నాయి. ఈ పోటీల్లో మొత్తం తొమ్మిది టీమ్‌లు పాల్గొన్నాయని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. గురువారం జరిగిన మ్యాచుల్లో వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల, సత్తెనపల్లి ఇంజినీరింగ్ కళాశాల, బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచాయి. విజేతలను యూనివర్సిటీ అధికారులు అభినందించారు.
News November 27, 2025
విజయవాడ చేరుకున్న నిర్మలా సీతారామన్

అమరావతి ప్రాంతంలో శుక్రవారం పలు బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకానున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విజయవాడ చేరుకున్నారు. తొలుత ఆమె గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగా పలువురు అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆమె విజయవాడలోని నోవాటెల్‌కు చేరుకున్నారు. రాత్రి అక్కడ బస చేసి రేపు ఉదయం 9:30 నిమిషాలకు బయలుదేరి అమరావతి CRDA కార్యాలయం వద్దకు చేరుకుంటారు.


