News April 17, 2024
HYD: ఫిలింనగర్‌లో యువతితో వ్యభిచారం.. RAIDS

వ్యభిచార గృహాలపై HYD పోలీసులు దాడులు కొనసాగిస్తున్నారు. తాజాగా ఫిలింనగర్ రోడ్ నం.8లో రైడ్స్ చేశారు. ‘అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం మేరకు దాడులు చేశాం. సబ్‌ఆర్గనైజర్, విటుడిని అరెస్ట్ చేశాం. దీపక్ అనే వ్యక్తి ఆన్‌లైన్ ద్వారా ఈ దందా చేస్తున్నట్లు గుర్తించాం’ అని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. వ్యభిచారకూపంలో మగ్గుతున్న యువతి(22)ని స్టేట్ హోంకు తరలించారు.
Similar News
News April 22, 2025
ఇంటర్ ఫలితాల్లో హైదరాబాద్‌కు నిరాశ

ఇంటర్ ఫలితాల్లో మన హైదరాబాద్ విద్యార్థులు నిరాశ పరిచారు. ఫస్టియర్‌లో 66.68 శాతంతో సరిపెట్టుకున్నారు. 85,772 మంది పరీక్ష రాశారు. ఇందులో 57,197 మంది పాస్ అయ్యారు. సెకండియర్‌లో విద్యార్థుల కాస్త మెరుగుపడ్డారు. 74,781 మంది పాస్ పరీక్ష రాయగా.. 50,659 మంది ఉత్తీర్ణులయ్యారు. 67.74 శాతం ఉత్తీర్ణత సాధించారు. మేడ్చల్, రంగారెడ్డి విద్యార్థులు సత్తాచాటారు. టాప్ 10లోనూ మన హైదరాబాద్ పేరు లేకపోవడం గమనార్హం.
News April 22, 2025
HYD: కంచుకోటలో కదలని కారు!

BRS కంచుకోటలో ఆ పార్టీ పోటీ చేయకపోవడం శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది. ఫిబ్రవరిలో జరిగిన GHMC స్టాండింగ్ కమిటీ ఎన్నిక, ఇప్పుడు జరుగుతోన్న MLC కోటా ఎన్నిక నుంచి BRS తప్పుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా వ్యతిరేక పవనాలు వీచినా.. గ్రేటర్ ప్రజలు గులాబీ జెండాను ఎగరేశారు. వాస్తవానికి MLC కోటాలో BRSకు 24 ఓట్లే ఉన్నా.. కనీసం ప్రత్యర్థులతో పోటీ పడకపోవడం శోచనీయం. దీనిపై మీ కామెంట్?
News April 22, 2025
HYD: అమర్నాథ్ యాత్ర.. ఇవి తప్పనిసరి!

అమర్నాథ్ యాత్రకు వెళ్లేవారికి గాంధీలో ప్రతి సోమ, బుధ, శుక్రవారాలలో మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. పలు వైద్య పరీక్షలు మాత్రం తప్పనిసరి చేయించుకోవాలి. CBP/ESR, సీయూఈ, ఈసీజీ, చెస్ట్ ఎక్స్ రే, ఎస్ క్రియేటినిన్, ఎఫ్బీఎస్/పీఎల్బీఎస్, బ్లడ్ గ్రూప్‌తో పాటు 50 ఏండ్లు పైబడినవారికి తమ 2 మోకాళ్ల ఎక్స్ రే అవసరం. అప్లికేషన్ మీద ఫొటో పెట్టి గాంధీలో ఇస్తే మెడికల్ సర్టిఫికెట్ ఇస్తారు.
SHARE IT