News November 27, 2025
రౌడీషీటర్స్ సంస్కరణ దిశగా రాచకొండ కమిషనరేట్

రాచకొండ పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. రౌడీషీటర్లను సంస్కరించే దిశగా ఉప్పల్, ఎల్బీనగర్, ఈసీఐఎల్ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిర్వహణలో భాగస్వాముల్ని చేశారు. తప్పులు దిద్దుకుని ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని వారు స్వాగతిస్తున్నారు. సమాజ మార్పు వైపు రాచకొండ కమిషనరేట్ పోలీసుల ముందడుగు వేశారు.
Similar News
News November 28, 2025
ఈ విచిత్రాన్ని గమనించారా?

ప్రపంచంలో చాలా చోట్ల భవనాలు, హోటళ్లు, హాస్పిటల్ బిల్డింగ్స్‌లో 13వ అంతస్తు ఉండదనే విషయం మీకు తెలుసా? ‘ట్రిస్కైడెకాఫోబియా’ వల్ల చాలామంది 13వ అంకెను అశుభంగా భావిస్తారు. ఈ అపోహ వల్ల ఎవరూ 13వ అంతస్తులో ఉండేవారు కాదట. వ్యాపార నష్టం జరగొద్దని నిర్మాణదారులు 13కు బదులుగా 12Aను వేస్తారని వినికిడి. చాలాచోట్ల ICU బెడ్స్‌కి కూడా 13 లేకుండా 14 రాస్తారని వైద్యులు చెబుతున్నారు. మీరు ఇది గమనించారా?
News November 28, 2025
పాడేరు: మీకోసం కార్యక్రమానికి 112 ఫిర్యాదులు

పాడేరు ఐటీడీఏలో శుక్రవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి 112 ఫిర్యాదులు అందాయి. ఐటీడీఏ పీవో శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్‌తో కలిసి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయన్నారు. మీకోసంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News November 28, 2025
తంగళ్ళపల్లి: తల్లి మరణం భరించలేక తనయుడి ఆత్మహత్య

నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన తంగళ్ళపల్లికి చెందిన లలిత సిరిసిల్ల మానేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంది. తల్లి మరణించిన విషయం తెలుసుకున్న కొడుకు అభిలాష్ అదే మానేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అభిలాష్ సిరిసిల్లలోని సర్దాపూర్ బెటాలియల్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తల్లి, కుమారుడు మరణించడంతో గ్రామంలో తీవ్రవిషాదం చోటు చేసుకుంది.


