News November 27, 2025
కరీంనగర్: మొదటి విడతలో 398 జీపీలు.. 3682 వార్డులు

స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటి విడతలో 398 జీపీలకు, 3682 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో జగిత్యాల జిల్లాలో 122 జీపీలు, 1172 వార్డులు, 1172 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో 99 జీపీలు, 896 వార్డులు, 896 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో 92 జీపీలు, 866 వార్డులు, 866 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సిరిసిల్ల జిల్లాలో 85 జీపీలు, 748 వార్డులు ఉన్నాయి.
Similar News
News November 27, 2025
NGKL: మొదటి రోజు నామినేషన్లు మండలాల వారీగా ఇలా..!

నాగర్‌కర్నూల్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. తొలిరోజు మొత్తం 121 సర్పంచ్ నామినేషన్లు దాఖలయ్యాయి.
వంగూరు: 24
తెలకపల్లి: 25
తాడూరు: 23
కల్వకుర్తి: 19
వెల్దండ: 19
ఊర్కొండ: 11
అలాగే, వార్డులకు 26 మంది నామినేషన్లు వేశారు.
News November 27, 2025
సిరిసిల్ల: జిల్లాకు చేరుకున్న ఎన్నికల పరిశీలకులు

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎలక్షన్ జనరల్, వ్యయ అబ్జర్వర్లు పీ.రవి కుమార్, కే.రాజ్ కుమార్ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ అధికారులు జిల్లా కేంద్రంలోని పంచాయతీ రాజ్ అతిథి గృహంలో అందుబాటులో ఉంటారు.
News November 27, 2025
సిరిసిల్ల: ‘జిల్లాను ప్రథమ స్థానంలో ఉండేలా చూడాలి’

ఆరోగ్య పథకాలు 100% సాధించాలని సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. సిరిసిల్లలో ఆరోగ్య పథకాలపై అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్య పథకాలు సాధించి జిల్లాను ప్రథమ స్థానంలో ఉండేలా చూడాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రామకృష్ణ, అనిత, నహిమ, సిబ్బంది పాల్గొన్నారు.


