News April 17, 2024
సత్తెనపల్లిలో మంత్రి అంబటి ఫొటోతో టీ కప్పులు

సత్తెనపల్లిలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో పట్టణంలోని టీ స్టాల్లలో మంత్రి అంబటి రాంబాబు, నరసరావుపేట పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్‌ల ఫొటోలతో ఉన్న టీ కప్పులు దర్శనమిస్తున్నాయి. కొందరు వైసీపీ నాయకులు తమకు ఈ కప్పులు ఇచ్చారని, టీ కొట్టు నిర్వాహకులు చెబుతున్నారు.
Similar News
News April 20, 2025
కొల్లిపర: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

కొల్లిపర మండలం గుడిబండి వారిపాలెంకి చెందిన గుంటూరు రత్న కుమారి (22) ఆదివారం మధ్యాహ్నం ఉరి వేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. కొల్లిపరలోని గవర్నమెంట్ హాస్పటల్‌కి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్ సుప్రియ నిర్ధారించారు. తెనాలి సీఐ ఆర్.ఉమేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 20, 2025
ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం : DEO

ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గుంటూరు DEO సి.వి రేణుక తెలిపారు. ఈ నెల 28 నుంచి మే 15 వరకు https://cse.ap.gov.in వెబ్ సైట్లో నమోదు చేసుకోవాలన్నారు. ఐదేళ్ళు నిండిన వారికి ప్రస్తుతం 1వ తరగతికి అడ్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. ఎంపిక రాష్ట్రస్థాయిలో ఉంటుందని, మే 16 నుంచి 20 వరకు వార్డు సచివాలయాల్లో డేటా ఆధారంగా అడ్మిషన్లు ఇస్తారని చెప్పారు.
News April 20, 2025
ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెండ్: డీఈఓ

నల్లచెరువు అంబేడ్కర్ ఎయిడెడ్ పాఠశాలలో అవకతవకలకు పాల్పడిన ఇద్దరు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను డీఈఓ సీవీ రేణుక సస్పెండ్ చేశారు. హాజరు తప్పుగా చూపడం, మధ్యాహ్న భోజన లబ్దిదారుల సంఖ్యను పెంచడం, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వంటి ఆరోపణలపై జాకీర్ హుస్సేన్, డి. రవిపై చర్యలు తీసుకున్నారు. డీఈఓ తనిఖీలో 46 మందికి హాజరు వేసినా, కేవలం 9 మంది విద్యార్థులే ఉండటం గమనార్హం.