News November 27, 2025
కరీంనగర్: మొదటి విడతలో 398 జీపీలు.. 3682 వార్డులు

స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటి విడతలో 398 జీపీలకు, 3682 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో జగిత్యాల జిల్లాలో 122 జీపీలు, 1172 వార్డులు, 1172 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో 99 జీపీలు, 896 వార్డులు, 896 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో 92 జీపీలు, 866 వార్డులు, 866 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సిరిసిల్ల జిల్లాలో 85 జీపీలు, 748 వార్డులు ఉన్నాయి.
Similar News
News December 6, 2025
ఫ్లైట్ల టికెట్ రేట్లు ప్రకటించిన కేంద్రం

ఇండిగో సంక్షోభం వేళ టికెట్ల ఛార్జీలపై కేంద్రం నియంత్రణ చర్యలు చేపట్టింది. దేశీయ విమాన సర్వీసులకు రేట్లను ప్రకటించింది. 500km వరకు టికెట్ ధరను రూ.7,500గా నిర్ధారించింది. 500-1000kmకు రూ.12,000 వరకు, 1000-1500kmకు రూ.15,000 వరకు, 1500km పైన ఉంటే రూ.18,000 వరకు మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఇండిగో ఫ్లైట్లు క్యాన్సిల్ కావడంతో మిగతా ఎయిర్‌లైన్స్ టికెట్ ధరలను భారీగా పెంచేసిన విషయం తెలిసిందే.
News December 6, 2025
కృష్ణా: స్క్రబ్ టైఫస్ లక్షణాలతో వ్యక్తి మృతి

పెనమలూరు పరిధిలోని ముద్దునూరులో 44 ఏళ్ల శివశంకర్ స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మృతి చెందారు. ఈ నెల 2న వైద్య పరీక్షల కోసం శాంపిల్స్ తీసుకున్నారు. 4న ఆయన చనిపోగా, ఇవాళ రిపోర్టుల్లో పాజిటివ్ అని తేలింది. మృతుడికి కిడ్నీ సమస్య కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గ్రామంలో జిల్లా వైద్య బృందం సర్వే నిర్వహిస్తోంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో 4, ఎన్టీఆర్ జిల్లాలో 2 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
News December 6, 2025
కేంద్ర మంత్రి నిర్మల వ్యాఖ్యలపై విమర్శలు

రూపాయి విలువ పతనంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన <<18486026>>వ్యాఖ్యలు<<>> విమర్శలకు దారి తీస్తున్నాయి. రూపాయి తన స్థాయిని కనుగొనడం అంటే డాలర్‌కు 100 రూపాయలు దాటడమా అని సెటైర్లు వేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరసనలు చేసి, అధికారంలో ఉన్నప్పుడు సమస్యను చిన్నదిగా చూపడం సరికాదని దుయ్యబడుతున్నారు. ఏమైనప్పటికీ చివరికి ధరలు పెంచి సామాన్యుడినే దోచుకుంటారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. మీరేమంటారు?


