News November 27, 2025

MBNR: అరుణాచలానికి స్పెషల్ బస్.. ఫోన్ చేయండి

image

మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని అరుణాచలం గిరి ప్రదక్షిణకు MBNR డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్ DEC 3న రాత్రి 7గం.కు బయలుదేరుతుందని డిపో మేనేజర్ సుజాత తెలిపారు. 4న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, 5న అరుణాచలం చేరుకొని మరుసటి రోజు గిరిప్రదక్షిణ, 6న MBNRకు చేరుకుంటుందన్నారు. ఛార్జీలు పెద్దలకు రూ.3,600, పిల్లలకు: రూ.2400 టికెట్ ధర ఉందన్నారు. వివరాలకు 70136 46089, 94411 62588, 99853 20529 సంప్రదించాలన్నారు.

Similar News

News November 27, 2025

రోజుకు 10వేల క్యాలరీల ఫుడ్ తిని.. నిద్రలోనే మృతి

image

రష్యాలో షాకింగ్ ఘటన జరిగింది. ఈటింగ్ ఛాలెంజ్ ద్వారా మొదట బరువు పెరిగి తర్వాత తగ్గే ప్రోగ్రామ్‌ను ప్రయత్నిస్తూ ఫిట్‌నెస్ కోచ్ డిమిత్రి నుయాన్జిన్(30) చనిపోయారు. ఆయన రోజుకు 10వేల క్యాలరీలకుపైగా జంక్ ఫుడ్ తిన్నట్లు తెలుస్తోంది. డిమిత్రి ప్రయత్నం వికటించి ఒక నెలలోనే 13KGలు పెరిగి 103KGలకు చేరారు. చివరికి గుండెపోటుతో నిద్రలోనే మరణించారు. ఇలాంటి ఛాలెంజ్‌లను ఎవరూ అనుసరించొద్దని నిపుణులు సూచిస్తున్నారు.

News November 27, 2025

అనంత: పాఠశాలల్లో ఖాళీ పోస్టులకు దరఖాస్తులు

image

అనంతపురంలో 2 ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 10 టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించినట్లు డీఈవో ప్రసాద్ బాబు తెలిపారు. సెయింట్ మేరీ బాలికల ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో ఎస్ఏ బయాలజీ, ఎస్ఏ తెలుగు, LPT (తెలుగు, హిందీ), పీఈటీ పోస్టులు ఉన్నాయన్నారు. RCM ఎయిడెడ్ ప్రైమరీ స్కూల్లో 5 SGT పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. దరఖాస్తు గడువును డిసెంబర్ 10 వరకు పొడిగించామన్నారు.

News November 27, 2025

అమరావతిలో వేంకటేశ్వర ఆలయం రెండేళ్లలో పూర్తి: సీఎం

image

AP: దేవతల రాజధాని అమరావతి అని, మన రాజధానికి అమరావతి పేరు పెట్టే అవకాశం దేవుడు తనకిచ్చారని CM CBN చెప్పారు. కృష్ణా తీరంలో వేంకటేశ్వర ఆలయ విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ‘ఈ ప్రాంతాన్ని కాపాడే శక్తి ఈ గుడికి ఉంది. రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని TTDని కోరుతున్నా. ఈ పవిత్ర కార్యక్రమానికి ప్రజలు సహకరించాలి. ఆరోగ్యం, సంపద, ఆనందం ప్రతిఒక్కరికీ ఇవ్వాలని స్వామిని వేడుకుంటున్నా’ అని పేర్కొన్నారు.