News April 17, 2024
కాకినాడ: వరుపుల V/S వరుపుల

ప్రత్తిపాడులో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ పోటీచేస్తున్న వైసీపీ, TDP- జనసేన- BJP కూటమి అభ్యర్థుల ఇంటిపేర్లు ఒకటే కావడం గమనార్హం. YCP నుంచి వరుపుల సుబ్బారావు బరిలో నిలవగా..కూటమి నుంచి వరుపుల సత్యప్రభ ఉన్నారు. 1985, 1989, 1999లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన సుబ్బారావు 3 సార్లు ఓటమి చెందారు. ఆ తర్వాత 2004లో గెలుపొందారు. 2009 ఓడి, 2014లో గెలిచారు. 2019లో పోటీలో లేరు. తాజాగా మరోసారి బరిలో నిలిచారు.
Similar News
News October 8, 2025
కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశానికి హాజరైన పురందీశ్వరీ

కరేబియన్ ద్వీప దేశం బార్బడోస్‌లో అక్టోబర్ 5 నుంచి 12 వరకు జరుగుతున్న 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశాలకు రాజమండ్రి ఎంపీ పురందీశ్వరి హాజరయ్యారు. ఆమె కామన్వెల్త్ మహిళా పార్లమెంటేరియన్ (CWP) చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమెతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివాన్ష్, ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఎంపీలు అనురాగ్ శర్మ, కె.సుధాకర్ కూడా పాల్గొన్నారు.
News October 8, 2025
మందులపై పన్ను రద్దు.. ప్రజలకు ఊరట: జేసీ

భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలు ప్రజల ఆరోగ్యానికి, కుటుంబ భద్రతకు మేలు చేసే విధంగా, సరళమైన, అందుబాటు ధరల్లో మార్పులకు శ్రీకారం చుట్టాయని జేసీ వై.మేఘ స్వరూప్ బుధవారం తెలిపారు. 2017లో అమలులోకి వచ్చిన జీఎస్టీ వ్యవస్థలో ఈ సవరణలు ప్రజలకు నేరుగా లాభం చేకూర్చే విధంగా 2.0 వెర్షన్ రూపుదిద్దుకుందని, ముఖ్యంగా మందులు, వైద్య సేవలు మరింత చౌకగా మారాయని ఆయన పేర్కొన్నారు.
News October 8, 2025
రాజమండ్రిలో హౌస్ బోట్లు

రాజమండ్రిలో టూరిస్టుల కోసం త్వరలో హౌస్ బోట్లు అందుబాటులోకి రానున్నాయి. రూ. 94 కోట్లతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా మూడు హౌస్ బోట్లు, నాలుగు జల క్రీడల బోట్లు సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు. వీటిని కొవ్వూరు గోష్పాద క్షేత్రం, పుష్కర్ ఘాట్, సరస్వతీ ఘాట్‌లలో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయిందని జిల్లా టూరిస్ట్ ఆఫీసర్ వెంకటాచలం తెలిపారు.